'Rawalpindi Express' Akhtar considers Dravid as his 'biggest nightmare'

Not sachin dravid a biggest nightmare says shoaib akhtar

cricket, shoaib akhtar, Rawalpindi Express, rahul dravid, sachin tendulkar, biggest nightmare, pakistan, team india, Shoaib Akhtar,Sachin Tendulkar,Rawalpindi,Kolkata,Pakistan , 'Rawalpindi Express' Akhtar considers Dravid as his biggest 'nightmare',news, India news

Shoaib Akhtar calls Rahul Dravid, not Sachin Tendulkar, his 'biggest nightmare'

సచిన్ కాదు.. ద్రావిడే నన్ను అధికంగా భయపెట్టింది

Posted: 08/21/2015 06:22 PM IST
Not sachin dravid a biggest nightmare says shoaib akhtar

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బౌలర్ గా ప్రఖ్యాతి పోంది, రావల్పిండి ఎక్స్ ప్రెస్ గా పిలవబడుతున్న షోయబ్ అక్తర్ తన మనస్సులోని మాటలను బయటపెట్టారు. తన కెరీర్లో తనను అత్యంత అధికంగా భయపెట్టిన బాట్స్ మెన్ పేరును ఆయన వెల్లడించారు. అయితే ఈ సందర్భంగా అక్కడున్న వారు భారత భ్యాటింగ్ దిగ్గజం సచిన్ పేరును చెప్పగానే కాదు, కాదు సచిన్ కాదని అన్నారు. తన కెరీర్లో తనను అత్యధికంగా భయపెట్టింది ది ఇండియన్ గ్రేట్ వాల్ గా పిలవబడిన రాహుల్ ద్రావిడ్ అని అయన అన్నారు.

సాధారణంగా ఎక్కువ మంది ప్రముఖ బౌలర్లు సచిన్ టెండుల్కర్ ను చూసి తాము గతి తప్పిన బంతులు వేశామంటుంటారని షోయబ్ అక్తర్ అన్నారు. అయితే తనను ఇబ్బంది పెట్టింది మాత్రం రాహుల్ ద్రావిడ్ అన్నారు. తనను భయపెట్టిన బ్యాట్స్‌మన్‌ కూడా ఉన్నాడని ఆయన చెప్పాడు. ప్రపంచంలో ఎంతోమంది దిగ్గజ బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్‌ చేశానని, కానీ ద్రావిడ్‌ రూటే వేరన్నాడు. అతడు బాక్సింగ్‌లో మహ్మద్‌ అలీ లాంటి వాడన్నాడు.

బౌలర్లను శారీరకంగా అలసటకు గురిచేసి, ఆ తర్వాత మానసికంగా చంపేస్తాడన్నాడు. అతడికి బౌలింగ్‌ చేయడం చాలా కష్టమన్నాడు. ఒక్క వసీం అక్రమ్‌ మాత్రం ద్రావిడ్‌ను కట్టడి చేయగలిగాడని చెప్పాడు. షోయబ్ అక్తర్ 1997లో తొలి టెస్ట్ అడాడు. 1999లో రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండుల్కర్‌లను అవుట్ చేయడం ద్వారా హెడ్ లైన్లకు ఎక్కాడు. ఈ ఏషియన్ టెస్ట్ ఛాంపియన్ షిప్ మ్యాచ్ కోల్‌కతాలో జరిగింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shoaib akhtar  Rawalpindi Express  rahul dravid  sachin tendulkar  biggest nightmare  

Other Articles