Bangladesh cruise in modest chase against India

Bangladesh seal first ever oneday series against india

Bangladesh, Team India, MS dhoni, Virat Kohli, Ind vs Ban, 2015, Cricket, Ind vs Ban 2015 news, teamindia, bangladesh, second one day, Sher-e-Bangla National Stadium, Mirpur bangladesh, Sports, Shikhar Dhawan,Ajinkya Rahane, Ambati rayudu, Sher-e-Banglam harbajan singh, MS Dhoni, Mahendra Singh Dhoni, captaincy, india tour of bangladesh 2015, Ravichandran Ashwin, India vs Bangladesh

Bangladesh, chasing a modest 200-run total in 47 overs against India, lost opener Tamim Iqbal in the 7th over but are cruising with the Sarkar-Das stand.

భారత్ పై సీరీస్ గెలుపుతో చరిత్ర సృష్టించిన బంగ్లా..

Posted: 06/21/2015 11:02 PM IST
Bangladesh seal first ever oneday series against india

బంగ్లాదేశ్.. ఒకనాటి ససికూన. . ప్రపంచ హాట్ ఫేవరేట్ జట్లలో ఒకటైన టీమిండియాను మట్టికరింపించిన పులులు. అలా ఇలా కాదు.. మునుప్పెన్నడే లేని విధంగా భారత్ పై వన్డే సీరీస్ ను గెలిచిన పులులు. క్రికెట్ చరిత్రలో తమకంటూ లేని ఒక పేజీని తెరవడంతో పాటు సువర్ణ అధ్యాయనాన్ని లిఖించింది బంగ్లా జట్టు. భారత్ పై తొలి వన్డే సీరీస్ ను కైవసం చేసుకుని దిగ్గజ ధోని సేనను మట్టికరిపించిన దిగ్గజేత్తగా నిలిచింది బంగ్లాదేశ్. ధోని సారధ్య వైఫల్యమో.. లేక వరుణుడి అటంకమో తెలియదు కానీ బంగ్లా పర్యటనలో దోనిసేన ఏ కోశాన తమ ప్రతిభను కనబర్చలేకపోయింది.

మూడు వన్డే ల సీరీస్ లో భాగంగా రెండు వన్డే మ్యాచ్ లను కైవసం చేసుకున్న బంగ్లాదేశ్.. ప్రపంచ క్రికెట్ లో ఇక తాము పసికూన కాదని, తమ సత్తాను టీమిండియాపై చాటింది. ఇటీవల ముగిసిన ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ జట్టను ఓడించి సత్తాను చాటుకున్న బంగ్లా తో టూర్ లో టీమిండియా ఆటగాళ్లు.. బ్యాట్స్ మెన్ సహా బౌలర్లందరూ పూర్తిగా విఫలమయ్యారు. పరుగులు సాధించడంతో టాప్ ఆర్డర్ తో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్లున విఫలయం కాగా, అటు బంగ్లా ఆటగాళ్ల విక్కెట్లు తీయడంలోనూ భారత బౌలర్లు చమటోడ్చాల్సి వచ్చింది.

మిర్పూర్ లో జరుగిన రెండో వన్డే మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎందుకున్న టీమిండియా.. పరుగలు వేటలో తడబడుతోంది. గత వన్డే మ్యాచ్ మిగిల్చిన ఓటమి గాయం నుంచి కోలుకుని రాణిస్తారనుకున్న ధోని సేన.. పరుగుల కోసం అపసోపాలు పడుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దోనిసేన.. నిర్ణీత 50 ఓవర్లలో ఇంకా ఐదు ఓవర్లు మిగిలే వున్నా.. అలౌట్ అయ్యింది. 45 ఓవర్లలో కేవలం 200 పరుగులు సాధించింది. దీంతో లక్ష్యచేధనలో రంగంలోకి దిగిన బంగ్లాదేశ్ డక్ వర్త్ లూయిస్ సద్దతిన 47 ఓవర్లలో 200 పరుగులు చేయాల్సి వుంది.

ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ మినహా.. అందరూ బంగ్లా బ్యాట్స్ మెన్లు బాగా రాణించారు. సౌమ్య సర్కార్ 34 పరుగులతో రాణించగా, లిట్టన్ దాస్ 36 పరుగులు ముషిఫికర్ రహీమ్ 31, షకీబ్ అల్ హసన్ 51, షబ్బీర్ రహమాన్ 22 పరుగులతో సునాయాసంగా ఇంకా తొమ్మిది ఓవర్లు మిగిలివుండగానే లక్ష్యాన్ని చేధించారు. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా బ్యాట్స్ మెన్లలో.. శిఖర్ ధావన్, ధోని, సురేష్ రైనా మినహా ఎవరూ రాణించలేకపోయారు. సూపర్ ఫామ్ లో వున్న అజ్యింక రహానేను ఈ మ్యాచ్ ను తప్పించిన కెప్టెన్ ధోని ఆయన స్థానంలో అంబటి రాయుడికి స్థానం కల్పించారు. అయితే ధోని అంచనాలు తలకిందులై.. అంబటి రాయుడు పరుగులేమి సాధించకుండానే వెనుదిరిగాడు.

అటు బౌలింగ్ లోనూ ధోని పలు మార్పులు చేశాడు. ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మల స్థానంలో అక్షర్ పటేల్, ధావల్ కులకర్ణిలకు జట్టులోకి తీసుకున్నారు. మూడు వన్డలే సీరిస్ లో భాగంగా జరుగుతున్న రెండో వన్డేలో ఓడిన ధోనిసేన  సీరిస్ బంగ్లాదేశ్ కు అప్పగించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మముస్తాఫిజుర్ రహమాన్ ఆరు విక్కెట్లను సాధించగా, నజీర్ హుస్సేన్, రుబెల్ హుస్సెన్ చెరో రెండు విక్కట్లను పడగోట్టారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : teamindia  bangladesh  second one day  Sher-e-Bangla National Stadium  Mirpur  

Other Articles