MS Dhoni Offers to Quit Captaincy Following Historic ODI Series Loss vs Bangladesh | Dhoni Controversies | India Team

Ms dhoni ready to quit captaincy india team lost historic odi series bangladesh

MS Dhoni, MS Dhoni news, MS Dhoni controversy, mahendra singh dhoni updates, MS Dhoni latest press meet, MS Dhoni latest interview, india vs bangladesh, india loss historic odd series vs bangladesh, team india cricketers, virat kohli, rohit sharma, Harbhajan Singh

MS Dhoni Ready To Quit Captaincy India Team Lost Historic ODI Series Bangladesh : Under-fire India captain Mahendra Singh Dhoni in a sarcastic tone said that if his removal from captaincy can help Indian cricket move in right direction then he is game for it.

‘నేను తప్పుకోవడానికి సిద్ధం’

Posted: 06/22/2015 10:07 AM IST
Ms dhoni ready to quit captaincy india team lost historic odi series bangladesh

ఒకనాటి పసికూనగా పిలవుబడిన బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు.. మునుపెన్నుడూలేని విధంగా భారత్ పై తొలిసారి వన్డే సిరీస్ గెలిచి ‘పులి’గా పిలువబడుతోంది. ప్రపంచ హాట్ ఫేవరేట్ జట్లలో ఒకటైన టీమిండియాను మట్టికరింపించింది. క్రికెట్ చరిత్రలో తమకంటూలేని ఒక పేజీని తెరవడంతోపాటు సువర్ణ అధ్యాయనాన్ని లిఖించుకుంది ఈ జట్టు. ధోని సారధ్య వైఫల్యమో.. లేక వరుణుడి అటంకమో తెలియదుకానీ బంగ్లా పర్యటనలో దోనిసేన ఇంత ఘోరపరాజయం పాలవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ క్రమంలోనే భారత్ జట్టుపై, ముఖ్యంగా ధోనీ కెప్టెన్సీ మీద మళ్లీ ఆరోపణలు వెల్లువెత్తడం మొదలయ్యాయి.

ప్రస్తుతం టీమిండియా జట్టు పరిస్థితి ఇంత కిందకు జారిపోవడానికి, జట్టులో అన్ని సమస్యలకు ధోనీయే కారణమంటూ ఆరోపణలు వస్తున్నాయి. గతంలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో భాగంగా భారత్ విఫలం అవ్వడంతో ధోనీని కెప్టెన్సీ నుంచి తొలగించాలంటూ వాదనలు వినిపించాయి. ఇప్పుడు బంగ్లా చేతిలో ఘోరంగా ఓటమి పాలవడంతో మళ్లీ ధోనీ కెప్టెన్సీపై కామెంట్లు వస్తున్నాయి. ఈ విధంగా తనపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ధోనీ తనదైన రీతిలో స్పందించాడు. ప్రస్తుత భారత క్రికెట్ లో అన్ని సమస్యలకు తనే కారణమైతే తాను కెప్టెన్సీ నుంచి సంతోషంగా తప్పుకోవడానికి సిద్ధంగా వున్నానని ధోనీ స్పష్టం చేశాడు.

ఈ క్రమంలోనే ధోనీ మాట్లాడుతూ.. ‘ఒకవేళ నన్ను తొలగించడం సమర్థనీయమైతే, టీమిండియా జట్టులో అన్ని సమస్యలకు నేనే కారణమైతే, నేను తప్పుకోవడానికి సిద్ధం’ అని పేర్కొన్నాడు. ఇక బంగ్లా చేతిలో ఓటమిపాలైన తీరును వెల్లడిస్తూ.. ‘రెండో వన్డే మ్యాచ్ లో మాకు మంచి ఆరంభం లభించలేదు. భాగస్వామ్యం నమోదు చేయాల్సిన సమయంలోనే వరుసగా వికెట్లు కోల్పోవడం దెబ్బతీసింది. 200 పరుగల లక్ష్యం ఏ జట్టుకైనా సులభమే కాబట్టి.. మా బౌలర్లను తప్పుపట్టను. ఇప్పుడు నేను ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు’ అని ధోనీ తెలిపాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MS Dhoni  India vs Bangladesh  Virat Kohli  

Other Articles