Lalit Modi 'used British royal family names for travel papers' says report

Lalit modi used british royal family names for travel papers

Lalit Modi, Indian Premier League (IPL), British Royal Family, Keith Vaz, Sushma Swaraj, Vasundara raje, British Royal family, andrew, travel documents, Duke of York, second son of Queen Elizabeth II, Prince Charles, Prince brother Andrew, PM narendra modi, rahul gandhi

According to the report in The Sunday Times, Andrew -- the Duke of York and second son of Queen Elizabeth II -- has known Modi for several years and met Modi at his London home last July, just days before his travel papers were granted.

తొవ్వినకొద్దీ బయటకోస్తున్న మోడీ లీలలు..

Posted: 06/21/2015 05:27 PM IST
Lalit modi used british royal family names for travel papers

మనీ లాండరింగ్ (నిధుల మళ్లింపు) సహా తీవ్రమైన ఆర్థిక నేరారోపణలు ఎదుర్కోంటున్న ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ.. ఇటు భారత దేశంలో విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ నే కాదు అటు బ్రిటన్ రాజు కుటుంబాన్ని కూడా వదల లేదు. బ్రిటెన్ రాజు చార్లెస్, ఆయన సోదరువడు అండ్రూ పేర్లను కూడా వాడుకుని యూనైటెడ్ కింగ్ డమ్ హోం మంత్రిత్వ శాఖ కార్యాలయం నుంచి ట్రావెల్ డాక్యూమెంట్లు పోందారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషయంతో అటు బ్రిటెన్ రాజకీయాల్లోనూ ప్రకంపనలు సృష్టించారు లలిత్ మోడీ.

ఈ విషయాన్ని లండన్ కేంద్రంగా ప్రచురితమైన ద సండే టైమ్స్ ప్రత్యేక కథనంలో వెలువరించింది. క్వీన్ ఎలిజబెత్ రెండో కుమారుడైన అండ్రూతో ఉన్న పరిచయాన్ని ఉపయెగించుకుని లలిత్ మోడీ.. తన ప్రయాణ ప్రతాలను పోందారని కథనం ఆ పత్రిక ప్రచురించింది. ట్రావెల్స్ డాక్యుెంట్స్ తన చేతికి రావడానికి కోన్ని రోజుల ముందే అండ్రూను మోడీ కలిశారని వెల్లడించింది. దీంతో బ్రిటెన్ రాజకీయాల్లోనూ మోడీ సంచలన వ్యక్తిగా మారిపోయారు. లలిత్ మోడీకి బ్రిటన్ ట్రావెల్ డాక్యూమెంట్స్ అందేందుకు సుష్మా స్వరాజ్, అంతకుముందు బ్రిటెన్ ఇమ్మిగ్రేషన్ విషయంలో వసుందర రాజే సహకరించారన్న వార్తలు వెలుగులోకి రావడంతో భారత్ లో రాజకీయ దుమారం కోనసాగుతున్న విషయం తెలిసిందే. సుష్మ తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని విఫక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం కూడా తెలిసిందే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lalith modi  British Royal family  andrew  travel documents  

Other Articles