hyderabad sunrisers won third time agaist punjab kings XI | IPL 8 season

Hyderabad sunrisers won agaist punjab kings xi cricket match ipl 8 season

hyderabad sunrisers, hyderabad sunrisers team members, shikhar dhawan, david warner news, punjab kings XI, punjab kings XI team, members, ipl 8 season, ipl 8 matches

hyderabad sunrisers won agaist punjab kings XI cricket match IPL 8 season : Finally Hyderabad gets third win by winning against punjab kings XI team. David warner has player excellent innings and bowlers done their magic again.

హైదరా‘బాదుడి’ ముందు పేలిపోయిన పంజాబ్

Posted: 04/28/2015 10:56 AM IST
Hyderabad sunrisers won agaist punjab kings xi cricket match ipl 8 season

ఐపీఎల్-8లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచులో హైదరా‘బాడుడి’ ముందు పంజాబ్ ఓటమిని చవిచూడక తప్పలేదు. ఈ రెండుజట్లతో పోల్చుకుంటే పంజాబ్ లోనే ధీటైన ఆటగాళ్లు వున్నప్పటికీ.. సన్ ‘రైజ’ర్స్ ముందు నిలబడలేకపోయారు. పైగా.. లక్ష్యం కూడా అతి తక్కువే వున్నప్పటికీ.. పంజాబ్ దానిని ఛేదించడంలో ఎన్నో అవస్థలు పడింది కానీ ఫలితం దక్కలేదు. దీంతో హైదరబాద్ జట్టు 20 పరుగుల తేడాతో అద్భత విజయాన్ని కైవలం చేసుకుంది. మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్ జట్టు.. ఆదిలోనే శిఖర్ ధావన్ వికెట్ కోల్పోయింది. దీంతో ఈ జట్టు పని ఇంతటితోనే ముగిసిందని భావించారు. అయితే.. కెప్టెన్ వార్నర్ 42 బంతుల్లో 58 పరుగులతో తన బ్యాటు ఝుళిపించి పరుగుల వర్షాన్ని కురిపించాడు. అలాగే హెన్రిక్స్, ఓజా, ఆశీష్ రెడ్డి తదితర బ్యాట్స్ మెన్లు తన ప్రతిభమేర స్కోరును జోడిస్తూ జట్టును ముందుకు తీసుకెళ్లారు. దీంతో హైదరబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు సాధించింది.

ఇక 151 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు కూడా ఆదినుంచే పేలవ పెర్ఫార్మెన్స్ ను ప్రదర్శించింది. ఈ జట్టులో ధీటైనా ఆటగాళ్లు సైతం వెనువెంటనే పవెలియన్ చేరారు. ఆటగాళ్లందరూ భారీ షాట్లకు పోయి బోర్లపడిపోయారు. దీంతో జట్టు ఒక్కసారిగా ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఆ సమయంలో సాహా తన బ్యాటింగ్ తో జట్టును గెలుపు అంచులదాకా తీసుకెళ్లాడు కానీ.. ఫలితం లేకపోయింది. చివరికీ పంజాబ్ 20 పరుగుల తేడాతో ఓటమిపాలయ్యింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : punjab kings XI  hyderabad sunrisers  shikhar dhawan  

Other Articles