Sachin Tendulkar Clashes Rumours On Daughter Sara Bollywood Entry

Sachin tendulkar clarification daughter sara bollywood entry shahid kapooor

Sachin Tendulkar news, Sachin Tendulkar twitter, Sachin Tendulkar daughter, Sachin Tendulkar family, Sachin Tendulkar son, Sachin Tendulkar daughter sara, Sachin Tendulkar son arjun, Sachin Tendulkar wife anjali, sara tendulkar, arjun tendulkar, bollywood, shahid kapoor

Sachin Tendulkar Clarification Daughter Sara Bollywood Entry Shahid Kapooor : Finally Sachin Tendulkar clashes the rumours about her daughter's film industry entry with hero shahid kapoor.

కూతురి సినీ ఎంట్రీపై సచిన్ స్పష్టత

Posted: 04/28/2015 10:05 AM IST
Sachin tendulkar clarification daughter sara bollywood entry shahid kapooor

గతకొన్నాళ్ల నుంచి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ సినీరంగ ప్రవేశంపై ప్రచారాలు కొనసాగాయి. హీరోయిన్ కు వుండాల్సిన లక్షణాలు (అందం) ఆమెకు వున్న నేపథ్యంలో బాలీవుడ్ దర్శకనిర్మాతలు తమ సినిమాల్లో నటింపజేసేందుకు క్యూ కడుతున్నారని వార్తలొచ్చాయి. అంతేకాదు.. త్వరలోనే ఈమె ఓ బాలీవుడ్ సినిమాలో నటుడు షాహిద్ కపూర్ తో జడకడుతున్నట్లు కథనాలు కూడా వెలువడ్డాయి.

ఈ వార్తలు కొన్నాళ్లనుంచి దుమారం రేగిన సందర్భంలో నిజమేనేమోనన్న సందేహాలూ వ్యక్తమయ్యాయి. అయితే.. ఈ విషయంపై ఏ అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ విషయంపై స్పష్టత రావాలంటే సచిన్ స్పందించాల్సిందేనని అనుకున్నారు. ఎట్టకేలకు ఈ విషయంపై సచిన్ క్లారిటీ ఇచ్చేశారు. తన కూతురు సారా సినీరంగప్రేవేశంపై ఆయన సోమవారం ట్వీట్ చేశారు. సారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం లేదని రూమర్లను ఖండించారు. ప్రస్తుతం సారాకి చదువు తప్ప మరో ధ్యాస లేదని ఆయన స్పష్టం చేశాడు.

‘సారా చదువును ఎంజాయ్ చేస్తోంది. ఆమె సినిమాల్లోకి వస్తోందన్న ఊహాగానాల్లో ఎటువంటి నిజం లేదు’ అంటూ సచిన్ ట్వీట్ చేశాడు. దీంతో సారా సినీఎంట్రీపై వస్తున్న రూమర్లకు ఇంతటితో ఫుల్ స్టాప్ పడినట్లే! 18 ఏళ్ల సారా ప్రస్తుతం ముంబైలోని ధీరూబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ లో చదువుకుంటోంది. ఈమెని ఇండస్ట్రీలో కాకుండా డాక్టర్ చేయాలన్న ఉద్దేశంలో సచిన్ వున్నారని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. మరోవైపు సచిన్ తన వారుసుడు అర్జున్ ని క్రికెట్ రంగంలో దింపిన విషయం తెలిసిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sachin Tendulkar  Sara Tendulkar  Arjun  sachin wife anjali  shahid kapoor  

Other Articles