chennai super kings won against kolkata knight riders with 2 runs | Chennai chidambaram stadium | ipl 8 updates

Chennai super kings won against kolkata knight riders chidambaram stadium ipl 8 updates

chennai super kings, kolkata knight riders, shahrukh khan, mahendra singh dhoni, robbin uthappa, gautham gambhir, ipl 8 updates, chennai chidambaram stadium

chennai super kings won against kolkata knight riders chidambaram stadium ipl 8 updates : Chennai Super Kings massively won the match against kolkata knight riders with only 2 runs.

చెన్నై మ్యాజిక్ ముందు బైర్లుకమ్మిన కోల్ కతా

Posted: 04/29/2015 10:34 AM IST
Chennai super kings won against kolkata knight riders chidambaram stadium ipl 8 updates

‘అనుకున్నదొకటి.. అయినదొకటి..’ అన్న వాస్తవం ఐపీఎల్ సందర్భంగా ఇప్పటికే ఎన్నోసార్లు చోటు చేసుకుంది. ఇటువంటి చమత్కారమే మరోసారి ఐపీఎల్-8 సీజన్ లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్ లో ఎవరూ ఊహించని విధంగా జరిగింది. ఐపీఎల్-8లో భాగంగా నిన్న(మంగళవారం) రాత్రి చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ ఇన్నింగ్స్ పూర్తి చేసుకున్న చెన్నై జట్టు అతి తక్కువ స్కోరుకే కుప్పకూలిపోవడంతో ఈ మ్యాచ్ ని కోల్ కతా అతి సునాయాసంగా గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ.. చివరికీ రిజల్ట్ అందరినీ షాక్ కి గురిచేసేలా చేసింది. ఈ మ్యాచ్ లో చెన్నై కెప్టెన్ ధోనీ మంత్రం మరోసారి ఫలించడంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. టాస్ గెలిచిన కోల్ కతా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుని ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఈ క్రమంలోనే బ్యాటింగ్ చేసేందుకు బరిలోకి దిగిన చెన్నై ఆటగాళ్లు.. మొదటి నుంచే బోల్తాపడ్డారు. ధీటైన ఆటగాళ్లు సైతం కోల్ కతా బౌలర్ల ముందు తమ ప్రతాపాన్ని ప్రదర్శించలేకపోయారు. దీంతో ధోనీ సేన నిర్ణీత ఓవర్లలో కేవలం 134 పరుగులు మాత్రమే సాధించింది. ఇక 135 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా ఆటగాళ్లు.. కెప్టెన్ గౌతమ్ గంభీర్ డకౌట్ కాగా మిగతా ఆటగాళ్లు మొదట బ్యాటింగ్ పవర్ ప్లేలో విజృంభించారు. జట్టు 6 ఓవర్లలోనే 2 వికెట్ల కోల్పోయి 52 పరుగులు చేశారు. రాబిన్ ఉతప్ప (39) శుభారంభాన్ని ఇచ్చాడు. దీంతో ఈ మ్యాచ్ కోల్ కతాకే కైవసమని అంతా అనుకున్నారు. అయితే.. అప్పుడే చెన్నై కెప్టెన్ ధోనీ.. తరుచూ బౌలర్లను మారుస్తూ బ్యాట్స్ మెన్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు.

అప్పటికీ బ్యాట్స్ మెన్లు కుదురుగా ఆడేందుకు ప్రయత్నించారు కానీ.. సాధ్యపడలేదు. ఇక విధ్వంసక ఆటగాడు యూసుఫ్ పఠాన్ రనౌట్ అవడంతో జట్టు ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఈ క్రమంలోనే 16వ ఓవర్ తర్వాత వరుసగా మూడు డకౌట్లు కావడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఇక చివరి ఆటగాళ్లు తమ శక్తిమేర జట్టును గెలిపించేందుకు ప్రయత్నించారు కానీ.. ఫలితం లేకపోయింది. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ధోనీ సేన రెండు పరుగుల తేడాతోనే విజయం సాధించింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chennai super kings  kolkata knight riders  ipl 8 updates  

Other Articles