Indian super star world class bats man sachin tendulkar hope the world cup teams in semis

sachin, tendulkar, world cup, 2015, australia, india, newzeland, southafrica

indian super star , world class bats man sachin tendulkar hope the world cup teams in semis. sachin dendulkatr hope australia, newzeland, india, southafrica entered into semis in the world cup 2015.

సచిన్ టెండూల్కర్ మాటే నిజమైంది..

Posted: 03/21/2015 05:43 PM IST
Indian super star world class bats man sachin tendulkar hope the world cup teams in semis

భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ జోస్యం నిజమైంది. మాస్టర్ ఊహించినట్టే ప్రపంచ కప్ సమరం సాగుతోంది.  ఈ మెగా ఈవెంట్ ఆరంభానికి ముందు సచిన్.. డిఫెండింగ్ చాంపియన్ భారత్, దక్షిణాఫ్రికా, ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సెమీస్కు దూసుకెళ్తాయని చెప్పాడు. సచిన్ చెప్పినట్టే ఈ నాలుగు జట్లు సెమీస్కు అర్హత సాధించడం విశేషం. ప్రపంచ కప్ ప్రారంభానికి రెండురోజుల ముందు సచిన్ ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను పంచుకున్నాడు. భారత్, సౌతాఫ్రికా, ఆసీస్, కివీస్ సెమీస్కు చేరుతాయని వెల్లడించాడు. సచిన్ ఈ నాలుగు జట్లను టైటిల్ ఫేవరెట్లగా అభివర్ణించాడు. లీగ్ దశలో టీమిండియా, పాకిస్థాన్ల మధ్య జరిగిన మ్యాచ్లో భారత్ను ఫేవరెట్గా పరిగణించాడు.

ప్రపంచ కప్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన టాప్-4 జట్లే సెమీస్కు చేరాయి. భారత్, కివీస్ ఓటమే లేకుండా జైత్రయాత్ర కొనసాగిస్తున్నాయి. లీగ్ దశలో ఈ రెండు జట్లు ఆయా గ్రూపుల్లో టాపర్లుగా నిలిచాయి. ఆల్ రౌండ్ షోతో అదరగొడుతున్నాయి. ఈ రెండు జట్ల తర్వాత టోర్నీలో నిలకడగా రాణిస్తున్న జట్లు ఆసీస్, సఫారీలే. లీగ్ దశలో ఈ రెండూ ఆయా గ్రూపుల్లో రెండో స్థానంలో నిలిచాయి.అయితే కప్పు ఏ జట్టు స్వంతం చేసుకుంటుందో మాత్రం చెప్పలేదు. అయితే ప్రస్తుతం నాలుగు జట్లు మంచి ఫాంలో ఉన్నాయి. మరి ఆతిథ్య జట్లలో ఏదో ఒక జట్టు కప్ ను స్వంతం చేసుకుంటుందా లేదా న్యూజిలాండ్ కానీ భారత్ కానీ ప్రపంచ కప్ ను ఇంటికి తీసుకెళతాయో చూడాలి. అయితే ప్రపంచ కప్ లో ఏడు మ్యాచ్ లలో ప్రత్యర్థి జట్లను ఆలౌట్ చేసి తిరుగు లేని విజయాన్ని చేజిక్కించుకున్న భారత్ ప్రపంచ కప్ ను ఖాతాలో వేసుకుంటుందా చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sachin  tendulkar  world cup  2015  australia  india  newzeland  southafrica  

Other Articles