In quarter finals of world cup newzeland won the match by 143 runs

New Zealand, win by, 144 runs,ICC Cricket World Cup, 4th Quarter-Final, New Zealand v West Indies, Wellington,

in quarter finals of world cup newzeland won the match by 143 runs. in the quarter finals of world cup 2015, newzeland vs westindies match, newzeland got great victory on westindies.

న్యుజిలాండ్ దెబ్బకు చిత్తైన వెస్టిండీస్

Posted: 03/21/2015 03:09 PM IST
In quarter finals of world cup newzeland won the match by 143 runs

ప్రపంచ కప్లో న్యూజిలాండ్ క్వార్టర్ ఫైనల్లో వెస్టిండీస్ ను చిత్తుచిత్తుగా ఓడించింది.  ఏకంగా కివీస్ 143  పరుగులతో విండీస్పై ఘనవిజయం సాధించింది. మార్టిన్ గుప్టిల్ కదంతొక్కడం, బౌల్ట్ సూపర్ స్పెల్తో అదరగొట్టడంతో విండీస్కు భారీ ఓటమి తప్పలేదు. 394 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన విండీస్ 30.3 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. విండీస్ ఆరంభంలోనే కష్టాల్లోపడింది. బౌల్ట్ వరుసగా చార్లెస్ (3), సిమన్స్ (12) అవుట్ చేసి విండీస్ను దెబ్బతీశాడు. అయినా గేల్, శామ్యూల్స్ దూకుడుగా ఆడుతూ విండీస్ను లక్ష్యం దిశగా నడిపించారు.  9 ఓవర్లలో విండీస్ 80/2 స్కోరు చేసింది. కరీబియన్లు కోలుకుంటున్న సమయంలో బౌల్ట్ మరోసారి చెలరేగి ఒకే ఓవర్లో శామ్యూల్స్, రాందిన్ను పెవిలియన్ చేర్చాడు. దీంతో విండీస్ పీకల్లోతు కష్టాల్లోపడింది. సహచరుల నుంచి సహకారం లేకపోయినా గేల్ పోరాటపటిమ చూపాడు. 8 సిక్సర్లు, 2 ఫోర్లతో 61 పరుగులు చేశాడు.  కాగా మిల్నె బౌలింగ్లో గేల్ బౌల్డయ్యాడు. దీంతో విండీస్కు ఏ మూలో దాగున్న ఆశలు ఆవిరయ్యాయి. ఇతర బ్యాట్స్మెన్ దూకుడుగా ఆడిన వికెట్లు కాపాడుకోలేకపోయారు. దీంతో విండీస్కు భారీ ఓటమి తప్పలేదు.

న్యుజిలాండ్ అంతకుముందు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 293 పరుగులు చేసింది. విండీస్ కు 394 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న గుప్టిల్ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. విండీస్ బౌలర్లను ఎడాపెడా బాదుతూ కెరీర్ లో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు.మెక్ కల్లమ్ 12, స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా గుప్టిల్ అనూహ్యంగా చెలరేగడంతో కివీస్ భారీ స్కోరు సాధించింది. డబుల్ సెంచరీ హీరో గుప్తిల్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ నెల 24న జరిగే తొలి సెమీస్లో కివీస్..  దక్షిణాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles