De villiers enters world cup top 10 scorers list

de Villiers enters World Cup top-10 scorers' list, South African cricket captain AB de Villiers, AB de Villiers, southafrica vs uae, uae versus south africa, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, uae, uae CWC 2015, Live Scores, Live Updates, south africa, south africa CWC 2015, Sports, World Cup Live

South African cricket captain AB de Villiers continued to script statistical history at the ongoing World Cup as he on Thursday entered the top-10 of all-time scorers’ list besides breaking the tournament record for most sixes by a player.

ప్రపంచ కప్ రికార్డుల్లోకి డివిలయర్స్..!

Posted: 03/12/2015 06:44 PM IST
De villiers enters world cup top 10 scorers list

సఫారీల సారధి ఏబీ డివిలియర్స్ ప్రపంచ కప్ రికార్డుల పుటలలోకి ఎక్కాడు. ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో డివిలయర్స్ స్థానం సంపాదించాడు. ఇవాళ యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుత ఆటతీరుతో అటు బ్యాటింగ్ తో పాటు బౌలింగ్, ఫీల్డింగ్ లో రాణించిన డివిలియర్స్ 99 పరుగులతో ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఏడవ ఆటగాడిగా స్థానం సంపాదించాడు. ప్రపంచ కప్ లో డివిలయర్స్ ఇప్పటి వరకు 1, 142 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో అత్యధిక పరుగులతో భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ 2 వేల 278 పరుగులతో ముందువరుసలో వున్నాడు.

ఇవాళ జరిగిన మ్యాచ్ లో డివిలియర్స్ బ్యాటింగ్ లో దూకుడుగా ఆడి 82 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 99 పరుగులు సాధించి తృటిలో సెంచరీ కోల్పోయాడు. అయితే 99 పరుగల వద్ద ఔటైన వారి సరసన మూడో వ్యక్తిగా కూడా డివిలియర్స్ చేరాడు. ఈ జాబితాలో అస్ట్రేలియాకు చెందిన ఆడమ్ గిల్ క్రిస్ట్ 2003లో 99 పరుగుల వద్ద ఔటవ్వగా, మరో ఆటగాడు సౌత్ ఆఫ్రికాకు చెందిన జేపీ డుమిని 2011 లో జరిగిన ప్రపంచ కప్ లో డుమినీ సైతం 99 పరుగల వద్ద ఔటయ్యాడు. ఇప్పడు వీరి సరసన డివిలియర్స్ చేరాడు. అంతేకాదండోయ్.. ప్రపంచ కప్ లో ఇప్పటి వరకు అత్యధిక సిక్స్ లు బాదిన జాబితాలోనూ డివిలియర్స్ చేరాడు. ఇప్పడి వరకు ఒక ప్రపంచ కప్ లో 18 సిక్స్ లు బాది అత్యధిక సిక్స్ బాదిన క్రికెటర్ గా వున్న అస్ట్రేలియా ఓపెనర్ మాధ్యూవ్ హెడెన్ రికార్డులను డివిలియర్స్ అధిగమించాడు. ఇవాళ యూఏఈపై సాధించిన నాలుగు సిక్స్ లతో ఆయన ప్రపంచ కప్ లో ఇప్పటికే 20 సిక్స్ లను బాదిన వ్యక్తిగా రికార్డులకెక్కారు.

యూఏఈతో జరిగిన కీలకమైన లీగ్ మ్యాచ్ లో డివిలియర్స్ బంతితో కూడా రాణించి వన్డేల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. నేటి మ్యాచ్ లో రెండు కీలక వికెట్లు తీసిన డివిలియర్స్ దక్షిణాఫ్రికా ఘనవిజయంలో సహకరించాడు. మూడు ఓవర్లు వేసిన డివిలియర్స్ 15 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. దీంతో డివిలియర్స్ 2014లో న్యూజిలాండ్ పై నమోదు చేసిన 28 పరుగులకు రెండు వికెట్లు రికార్డును అధిగమించాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  southafrica  uae  

Other Articles