Uae crumble in steep chase against south africa

southafrica vs uae, uae versus south africa, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, uae, uae CWC 2015, Live Scores, Live Updates, south africa, south africa CWC 2015, Sports, World Cup Live

UAE Crumble in Steep Chase against south africa

యూఏఈపై ఘనవిజయంతో క్వార్టర్స్ లో కి సఫారీలు

Posted: 03/12/2015 05:34 PM IST
Uae crumble in steep chase against south africa

ప్రపంచ క్రికెట్‌కప్‌ టోర్నమెంటులో భాగంగా పూల్ బీలో వెల్లింగ్టన్ వేదికగా యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో జరుగిన మ్యాచ్‌లో  దక్షిణాఫ్రికా అన్ని రంగాలలో అద్బుత ప్రదర్శనను కనబర్చి.. క్వార్టర్ ఫైనల్స్ కు దూసుకెళ్లింది. ఊహించినట్లుగానే యూఏఈను దక్షిణాఫ్రికా దంచేసింది. కీలకమైన లీగ్ మ్యాచ్ లో దూకుడుగా ఆడిన సఫారీలు పసికూన యూఏఈపై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ లో ఆపై బౌలింగ్ లోరాణించిన సఫారీలు 146 పరుగుల భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. దీంతో గ్రూప్ -బి నుంచి  క్వార్టర్స్ కు చేరుకున్న రెండో జట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డిండ్ అన్ని విభాగాల్లో మెరుగైన అటతీరును కనబర్చింది.

దక్షిణాఫ్రికా విసిరిన 341 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన యూఏఈ ఆదిలోనే తడబడింది. 29 పరుగుల వద్ద తొలి వికెట్ ను కోల్పోయిన యూఏఈ.. 45 పరుగుల వద్ద అంజద్ అలి (21), ఖుర్రం ఖాన్ (12) కీలకమైన వికెట్లను కోల్పోయింది. ఆ క్రమంలోనే మరో వికెట్ ను నష్టపోకుండా 100 పరుగుల మార్కును దాటింది. అయితే అటు తరువాత యూఏఈ 17 పరుగుల వ్యవధిలో మరో మూడు వికెట్లను కోల్పోయి ఒక్కసారిగా కష్టాల్లో పడింది. యూఏఈ ఆటగాళ్లలో షైమాన్ అన్వర్(39), అంజాద్ అలీ(21), పాటిల్(57*)పరుగులు మినహా ఎవరూ రాణించకపోవడంతో ఆ జట్టు 47.3 ఓవర్లలో 195 పరుగులకే చాపచుట్టేసి ఘోర ఓటమి మూటగట్టుకుంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో  మోర్కెల్, డివిలియర్స్ ,ఫిలిండర్, చెరో రెండు వికెట్లు లభించగా, ఇమ్రాన్ తాహీర్, జేపీ డుమినీలకు తలో వికెట్ దక్కింది.

అంతకుముందు టాస్ గెలిచి యూఏఈ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో, బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 341 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్లలో డివిలియర్స్ అత్యధికంగా 99 పరుగులు చేయగా ఆమ్లా 12, డీకాక్ 26, రూసో 43, మిల్లర్ 49, డుమినీ 23 పరుగులు చేశారు.  కాగా బెహర్దీన్ 64, ఫిలాండర్ 10 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. యూఈఏ బౌలర్లలో మహ్మద్ నవీద్ అత్యధికంగా 3 వికెట్లను పడగొట్టగా, కామ్రాన్ షాజద్, అంజద్ జావేద్, మహ్మద్ తాకీర్ తలో వికెట్ తీశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  southafrica  uae  

Other Articles