ప్రపంచ కప్ టోర్నమెంటులో భాగంగా జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ లో తమ దేశం తరుపున అతను ప్రదర్శించిన అద్బుత ప్రతిభ.. అతడిని స్వేచ్ఛా జీవుడిని చేసింది. అతని అద్బుత ప్రతిభకు మోకరిల్లిన ఓ నటి అతనిపై పెట్టిన కేసును విత్ డ్రా చేసుకుంది. అది కూడా అలాంటిలాంటి కేసు కాదు.. అత్యాచారం కేసు. నమ్మశక్యం కలగడం లేదు కదూ..? కానీ ఇది నిజం. ఇది జరిగింది మన పోరుగు దేశం బంగ్లాదేశ్ లో. ప్రపంచ కప్ జట్టులో భాగం పంచుకున్న రూబెల్ హోస్సేన్ ఇంగ్లాండ్ పై జరిగిన మ్యాచ్ లో తన అద్భుత ఆటతీరును ప్రదర్శించాడు. అంతే అతని బౌలింగ్ కు మంత్రముగ్దురాలైన నటి అతనిపై వేసిన కేసును ఉపసంహరించుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ప్రపంచ క్రికెట్ టోర్నమెంటుకు నటి నజ్నీన్ అక్తర్ హప్పీ పై అత్యాచారం కేసులో రూబెల్ హుస్సేన్ అరెస్టయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ బంగ్లాకు చెందిన చెందిన 19ఏళ్ల నటి నజ్నీన్ అక్టర్ హప్పీ అతడిపై ఈ కేసు పెట్టింది. అయితే ప్రపంచ కప్ క్వార్టర్స్ కు చేరి తమ క్రికెట్ చరిత్రలోనే అతి పెద్ద ఫీట్కు కారణమైన రూబెల్పై ఆమె తన కోపాన్ని చల్లార్చుకుంది. అతడిని క్షమించేస్తున్నట్లు ప్రకటించి... వెంటనే రేప్ కేసును వెనక్కి తీసుకుంది. 'ఇప్పుడు రూబెల్కు వ్యతిరేకంగా నేను ఎలాంటి ఆధారాన్ని సాక్ష్యాన్ని ఇవ్వను. దీంతో అతడిపై ఇక ఏ కేసూ ఉండదు' అని హప్పీ స్పష్టం చేసింది. అయితే అంతకుముందు... రూబెల్స్పై ప్రపంచకప్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండాలని కోరుకుంటున్నట్టు హప్పీ లాయర్ ఆమెతో స్పష్టం చేశారు. దీంతో తను కూడా కేసుపై పునరాలోచించింది.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more