Sangakkara dilshan star in sri lanka s run fest v scotland

Sangakkara, Dilshan star in Sri Lanka's run-fest vs Scotland, Srilanka versus Scotland, Srilanka versus Scotland, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, Scotland, Scotland CWC 2015, Live Scores, Live Updates, Srilanka, Srilanka CWC 2015, Sports, World Cup Live, sangakkara, dilshan

Kumar Sangakkara became the first batsman to hit four successive centuries in one-day internationals to help Sri Lanka wrap up their World Cup pool campaign with a 148-run romp over Scotland at Bellerive Oval on Wednesday.

శ్రీలంకపై పోరులో కుప్పకూలిన పసికూన..!

Posted: 03/11/2015 07:49 PM IST
Sangakkara dilshan star in sri lanka s run fest v scotland

ప్రపంచ కప్ టోర్నమెంటులో భాగంగా గ్రూప్ ఏ లో స్కాట్లాండ్ తో హోబర్ట్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో శ్రీలంక ఘనవిజయం సాధించింది. శ్రీలంక బౌలర్లు రాణించి ప్రత్యర్థి జట్టును కేవలం 215 పరుగులకే కట్టడి చేశారు. దీంతో శ్రీలంక స్కాట్లాండ్ పై 148 పరుగులతో ఘనవిజయాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక దిల్షాన్ (104), సంగక్కర (124)లు శతకాలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 363 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో తడబడిన స్కాట్లాండ్ 43.1 ఓవర్లలో 215 పరుగులకే ఆలౌటైంది. ఈ విజయంతో శ్రీలంక ఎనిమిది పాయింట్లు సాధించి పూల్ ఎ లో రెండో స్థానంలో నిలిచింది.

శ్రీలంక నిర్ధేశించిన 364 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్‌ అంత సులువుగా ఒటమిని అంగీకరించలేదు. 44 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ధశలో పీకల్లోతు కష్టాలలో వున్నా.. జట్టు గెలుపుకు కోలెమన్, మొమ్సోన్ లు జట్టును గెలుపుదిశగా తీసుకెళ్లారు. ఓపెనర్లు కోయెట్జర్, మెక్లియాడ్తో పాటు మాచెన్ ఔటైన తరువాత.. క్రీజ్ లోకి వచ్చిన కొలెమన్, మొమ్సెన్ బ్యాటింగ్ అచితూచి ఆడుతూ స్కోరుబోర్డును ముందుకు నడిపించారు. 162 పరుగుల వద్ద మొమ్సెన్ 60 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ అయ్యాడు. ఆ తరువాత కోలెమన్ 7 పోర్ల సాయంతో 70 పరుగులు పూర్తి చేసి అవుటయ్యాడు. ఇక అక్కడి నుంచి స్కాట్లాండ్ బ్యాట్స్ మెన్ వెనువెంటనే అవుటవ్వడంతో 215 పరుగులకే అంతా చాపచుట్టేశారు. లంక బౌలర్లలో చమీరా, కులశేఖరలు చెరో మూడు వికెట్లు తీసుకోగా, మలింగ రెండు, తిసార ఫెరీరా, దిల్షాన్ చెరో విక్కట్ దక్కింది.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక జోరు కోనసాగించింది. ఓపెనర్‌ దిల్షాన్ (104) శతకంతో రాణించగా..సూపర్ ఫామ్‌లో ఉన్న మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సంగక్కర (124) ప్రపంచకప్‌లో వరుసగా నాలుగో శతకం సాధించి అరుదైన రికార్డు సాధించాడు. వీరిద్దరి జోరుకి చివర్లో కెప్టెన్ మాథ్యూస్ (51) మెరుపులు తోడవడంతో శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 363 పరుగులు చేసింది. స్కాట్లాండ్ బౌలర్లు సంగక్కర, దిల్షాన్‌ల దెబ్బకు మొదటి 36 ఓవర్లలో చేతులెత్తేసినా చివల్లో పుంజుకుని వరుసగా శ్రీలంక వికెట్లు తీసి ఆకట్టుకున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc criket world cup 2015  Srilanka  Scotland  srilanka  

Other Articles