Sachin tendulkar interesting comments india cricket team icc world cup 2015

sachin tendulkar news, india cricket team, india vs pakistan match, india cricket team world cup, icc world cup 2015, sachin comments, sachin interesting comments, sachin tendulkar cricket career, sachin tendulkar facebook, sachin twitter, sachin social networks, sachin tendulkar latest news, sachin tendulkar press meet

sachin tendulkar interesting comments india cricket team icc world cup 2015 : The master blaster sachin tendulkar has done some interesting comments on india cricket team.

టీమిండియాపై సచిన్ ‘సమ్ థింగ్ స్పెషల్’ వ్యాఖ్యలు...

Posted: 02/11/2015 03:22 PM IST
Sachin tendulkar interesting comments india cricket team icc world cup 2015

వరల్డ్ కప్ సమరం దగ్గరపడుతున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానులతోపాటు ప్రముఖ క్రీడాకారుల్లో ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఏ జట్టు ఈ కప్’ను గెలుస్తుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చాలామంది ప్రముఖులు తమతమ జట్ల తరఫున ప్రచారాలు జరుపుకుంటున్నారు. తమ జట్టే గెలుస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే.. అందరికంటే సచిన్ వ్యాఖ్యానించిన తరహా మరోలా వుంది. అందరూ వాయిస్తున్న డప్పు సౌండ్ ఒకే విధంగా వుంటే.. సచిన్’ది మాత్రం ఉత్సాహభరితంగా వుంది.

గతకొన్నాళ్ల నుంచి టీమిండియా ప్రదర్శించిన పేలవ పెర్ఫార్మెన్స్’పై ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే! అంతేకాదు.. ప్రపంచకప్ మొదటిరౌండ్’లోనే ఇండియా వెనక్కు తిరిగి వచ్చేస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక భారతీయ అభిమానులైతే ఇండియా ఆటగాళ్లను లెక్కపెట్టి మరీ తిట్లపురాణాన్ని సంధిస్తున్నారు. కప్ గెలుస్తుందన్న ఆశాభావాన్ని ఎవరూ వ్యక్తం చేయడం లేదు. అయితే.. ప్రముఖులు మాత్రం ఇండియా ఖచ్చితంగా గెలుస్తుందని జపం చేస్తున్నారు. అయితే.. సచిన్ పేర్కొంటున్న తీరు చూస్తుంటే అభిమానుల్లో ఆశలు రేకెత్తించేలా వున్నాయి.

వరల్డ్ కప్’లో టీమిండియా ఖచ్చితంగా గెలుస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేసిన సచిన్.. తనదైన రీతిలో కొన్ని వ్యాఖ్యానాలు చేశారు. టోర్నీలో ధోనీ సేన అత్యుత్తమ ఆటతీరును కనబరుస్తుందని, దేశ ప్రలజ ముఖాలపై చిరునవ్వులు పూయించేందుకు ఇండియాజట్టు ‘సమ్ థింగ్ స్పెషల్’ రీతిలో రాణిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత జట్టుపై పూర్తి నమ్మకం వుందన్న సచిన్.. అభిమానుల మద్దతు, ప్రార్థనలతోనే టీమిండియా ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శనను కనబరుస్తారని అన్నాడు. చెన్నైలోని తాంబరం వద్ద సాయిరాం ఇన్ స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ ఇండోర్ స్టేడియం ప్రారంభించిన సందర్భంగా సచిన్ ఇలా పేర్కొన్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles