New zealand robot ikram predicts afghanistan to win world cup

new zealand robot ikram, robot ikram news, new zealand robot ikram news, eduardo Sandoval, ikram robot eduardo sandoval, afghanistan cricket team, icc world cup 2015

New Zealand robot Ikram predicts Afghanistan to win World Cup : New Zealand robot ikram which is made by Eduardo Sandoval is predecting that.. Afghanistan team will win world cup 2015.

రోబో చెప్పిన జోష్యం.. వరల్డ్ కప్ @ఆఫ్ఘన్!

Posted: 02/11/2015 03:49 PM IST
New zealand robot ikram predicts afghanistan to win world cup

ఈసారి జరగబోయే వరల్డ్ కప్ ఏ జట్టు గెలుచుకుంటుందోనని దిగ్గజాలు సైతం గోళ్లు కొరుక్కుంటూ తీవ్ర ఉత్కంఠలో వుంటే.. ఓ రోబో మాత్రం ఈ కప్’ను పిల్లజట్టు అయిన ఆఫ్ఘన్ సునాయాసంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తోంది. ఎందరో ప్రతిభావంతులు కలిగిన అగ్రశ్రేణి జట్లకు కప్ గెలిచేంత సీన్ లేదని, అహంకార భావంతో ఆ జట్లన్నీ ఓడిపోవడం ఖాయమని సదరు రోబో తెలుపుతోంది. ‘పిట్ట కొంచెం.. కూత ఘనం’ అన్నట్లుగానే ఆఫ్ఘనిస్తాన్ చిన్న జట్టైనా వరల్డ్ కప్ గెలవడం ఖాయమని ఆ రోబో స్పష్టం చేస్తోంది.

న్యూజిలాండ్’లోని కాంటర్ బరీ విశ్వవిద్యాలయానికి చెందిన రోబో ‘ఇక్రమ్’ ఈ విషయాన్ని తేల్చి చెబుతోంది. టోర్నీలో పాల్గొంటున్న మొత్తం 14 జట్ల జాతీయ పతాకాలను తదేకంగా పరిశీలించిన ఈ రోబో.. చివరకు ఆఫ్ఘనిస్తాన్ వైపు మొగ్గు చూపుతూ ఆ జట్టు గెలుస్తుందని జోష్యం చెబుతోంది. ఇదే విషయమై ఆ రోబో సృష్టికర్త ఎడ్వర్డో సాండోవల్ మాట్లాడుతూ... టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ గెలిచే అవకాశాలు చాలా తక్కువున్నప్పటికీ.. క్రికెట్’లో ఏదైనా సాధ్యమేనంటూ వాపోయారు. అంటే.. ఆఫ్ఘనే గెలుస్తుందని ధీమాను ఆయన కూడా వ్యక్తం చేస్తున్నాడన్నమాట!

బౌలర్లపై విరుచుకుపడే బ్యాట్స్ మెన్లు, వారిని బెంబేలెత్తించే బౌలర్లు, పాదరసంలా కదిలే ఫీల్డర్లులాంటి ఆటగాళ్లు కలిగిన జట్లు.. ఈ రోబో జోష్యం ముందు తమ ప్రతిభను ఏ మేరకు ప్రదర్శిస్తారో వేచి చూడాలి! ఒకవేళ ఆ రోబో అన్నట్లు ఆఫ్ఘన్ కప్ గెలిస్తే.. దాని డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరిగే అవకాశాలుంటాయి. ఏం జరుగుతుందో చూద్దాం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : new zealand robot ikram  afghanistan cricket team  icc world cup 2015  

Other Articles