India outclass afghanistan in world cup warm up for first win in australia

India outclass Afghanistan, india wins in warm up match, india records first win in Australia, Rohit Sharma, Ajinkya Rahane, Suresh Raina, Mahendra Singh Dhoni, Daniel, Hamid Hassan, Afghanistan, Team India, world cup live updates, icc world cup 2015, world cup scores,world cup indian team score, world cup results, world cup score cards, icc cricket world cup 2015

Rohit Sharma smashed his way to a strokeful 150 while Ajinkya Rahane blasted an unbeaten 88 as India outclassed minnows Afghanistan by 153 runs in the World Cup warm-up match in Adelaide

అఫ్ఘనిస్థాన్ పై విజృంభించిన టీమిండియా.. 153 పరుగుల విజయం

Posted: 02/10/2015 06:22 PM IST
India outclass afghanistan in world cup warm up for first win in australia

వరల్డ్ కప్ సన్నాహక మ్యాచ్ ల్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 153 పరుగులతో ఘన విజయం సాధించింది. రోహిత్ శర్మ 150 పరుగులకు తోడు రహానే 88 పరుగులు జట్టుకు అసీస్ గడ్డపై తొలి విజయాన్ని సాధించి పెట్టాయి. అదే సమయంలో ఫామ్ కోసం నిరంతరం శ్రమిస్తున్న సురేష్ రైనా బ్యాట్ ను ఝుళిపించడంతో.. పామ్ లోకి వచ్చాడు. గత వార్మప్ మ్యాచ్ లో ఆసీస్పై చావుదెబ్బ తిన్న టీమిండియా ఈ మ్యాచ్ లో మాత్రం అన్ని విభాగాల్లో రాణించింది. పెద్ద జట్లపై చెత్తప్రదర్శనతో విమర్శలపాలైన ధోనీసేనకు పసికూనలపై ఫుల్ ప్రాక్టీస్ లభించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 364 భారీ స్కోరు సాధించింది.

ఓపెనర్ రోహిత్ శర్మ (122 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 150) సెంచరీతో చెలరేగాడు. అతనికి తోడు సురేశ్ రైనా 71 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 75, అజింక్య రహానె 61 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 88 నాటౌట్గా నిలిచి ఆఫ్ఘనిస్తాన్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు. ఆఫ్ఘన్ బౌలర్లలో హమిద్ హసన్, మహ్మద్ నబి. దవ్లాత్ జద్రన్, షాపూర్ జద్రన్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. భారీ లక్ష్యఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 211 పరుగులే చేసింది. మంగల్ (60) అర్ధ శతకంతో పాటు ఘని (44)  రాణించారు. మిగతా బ్యాట్స్మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు సాధించలేదు. భారత బౌలర్లలో మోహిత్ శర్మ 2 వికెట్లు, రవీంద్ర జడేజా 2, రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్, సురేశ్ రైనా ఒక్కో వికెట్ తీశారు.  

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc cricket world cup 2015  team india  afghanistan  warmup match  

Other Articles