Zaheer abbas controversial comments india pakistan cricket teams world cup 2015

india cricket team, pakistan cricket team, india pakistan match, zaheer abbas news, india pakistan matches, icc world cup 2015, mahendra singh dhoni, virat kohli, pakistan cricket players, india cricket players, zaheer abbas news, team india world cup news

zaheer abbas controversial comments india pakistan cricket teams world cup 2015 : The Batting Star Zaheer Abbas said that this is the best chance for pakistan to win on india.

టీమిండియాపై పాక్ విజయం తథ్యం!

Posted: 02/09/2015 04:19 PM IST
Zaheer abbas controversial comments india pakistan cricket teams world cup 2015

ఇండియా క్రికెట్ జట్టు ఆటతీరు గతకొన్నాళ్ల నుంచి చాలా దారుణంగా వున్న సంగతి తెలిసిందే! ఆమధ్య ఇంగ్లాండ్ జట్టుతో టెస్టు సిరీస్’లో ఆడిన ఇండియా.. చాలా దారుణంగా ఓడిపోయి తట్టాబుట్టా సర్దేసుకుని ఇండియా వచ్చేసింది. అలాగే ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచుల్లోనూ అదే తీరు కంటిన్యూ అయ్యింది. ఏ ఒక్క ఆటగాడు తన నైపుణ్యాన్ని ప్రదర్శించలేకపోయారు. అంతెందుకు.. వరల్డ్ కప్ సమరంకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వార్మ్ అప్ మ్యాచులోనూ పేలవ పెర్ఫార్మెన్స్’తో ఓటమి పాలయ్యింది. దీన్ని బట్టి చూస్తుంటే.. ఇండియా మొదట్లోనే వెనక్కు తిరిగి వచ్చే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయని కొందరు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో మాట్లాడిన బ్యాటింగ్ దిగ్గజం జహీర్ అబ్బాస్... టీమిండియాపై పాక్ సునాయాసంగా గెలుపుపొందే ఛాన్సెస్ ఎక్కువగా వున్నాయంటూ తెలిపాడు. వరల్డ్ కప్’లో ఇండియాపై నెగ్గేందుకు పాకిస్థాన్’కు ఇదే మంచి సమయమని ఆయన అన్నాడు. ఆసీస్ పర్యటనలో టీమిండియా ఆటతీరు చూసిన తర్వాతే తాను ఈ అభిప్రాయానికి వచ్చినట్లు స్పష్టం చేశాడు. నిజానికి వరల్డ్ కప్ చరిత్రలో భారత్’పై పాకిస్థాన్ ఇప్పటివరకు నెగ్గిందిలేదు కానీ.. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే.. ఈసారి భారత్’పై పాక్ గెలిచే సువర్ణవకాశం లభించిందని ఆయన అంటున్నాడు.

‘ఈసారి పాకిస్థాన్ ముందు సువర్ణవకాశం నిలిచింది. నిన్నటి ప్రాక్టీస్ మ్యాచ్ సహా ఆస్ట్రేలియాలో టీమిండియా ప్రదర్శనను చూసిన తర్వాతే ఈ అభిప్రాయానికొచ్చాను’ అని అబ్బాస్ స్పష్టం చేశాడు. అలాగే.. పాకిస్థాన్’తో పోల్చుకుంటే.. డిఫెండింగ్ చాంప్ హోదాలో టోర్నీలో అడుగుపెడుతున్న భారత్’పైనే అధిక ఒత్తిడి వుంటుందని ఆయన విశ్లేషించాడు. ఇక ఇతనిలాగే భారత్ అభిమానులు సైతం ఇండియాజట్టుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. భారత్ పేలవ ఆటతీరు చూస్తుంటే పాక్ చేతిలో ఓడిపోయే ప్రమాదముందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఇండియా జట్టు ఎలా ఆడుతుందో వేచి చూడాలి!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : zaheer abbas news  india pakistan match  icc world cup 2015  

Other Articles