India set a target of 265 for sri lanka

Asia Cup,India,Sri Lanka,cricket,india tv news, ndia set a target of 265 for Sri Lanka, Ind Vs Srilanka

India managed to score 264/9 after the late collapse threatened to restrict India below 250 against Sri Lanka on a slow wicket here Friday.

శ్రీలంక కు సామాన్యమైన టార్గెట్ ఇచ్చిన ఇండియా

Posted: 02/28/2014 06:40 PM IST
India set a target of 265 for sri lanka

ఆసియా కప్ లీగ్ మ్యాచ్ లో భాగంగా శ్రీలంకతో తలపడుతున్న భారత్ టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసి, ఓ మోస్తారు లక్ష్యాన్ని లంకేయుల ముందు ఉంచింది.

భారత ఓపెనర్ బ్యాట్స్ మెన్స్ రోహిత్ శర్మ – శిఖర్ ధావన్ లు ఇన్నింగ్స్ ను నెమ్మదిగా ప్రారంభించినా, రోహిత్ శర్మ తొలి వికెట్ 33 పరుగుల వద్ద వెనుదిరిగిన తరువాత క్రీజులోకి వచ్చిన కోహ్లి(48) ధావన్(94) లు కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పడంతో పాటు రెండో వికెట్ కి 97 పరుగులు జోడించి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరును అందించారు.

ధావన్ సెంచరీకి చేరువలో, కోహ్లీ అర్థ సెంచరీకి చేరువలో ఉండగా వెనుదిరగడంతో భారత్ స్కోరు బాగా మందగించడంతో పాటు, తరువాత వచ్చిన బ్యాట్స్ మెన్స్ ఎవరూ అంతగా రాణించకపోవడంతో 264 స్కోరుకే పరిమితం అయ్యింది. శ్రీలంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. మెండీస్ కి 4, సేనానాయకె 3, మలింగ, చతురంగ, డిసిల్వా తలో వికెట్ తీశారు.

లక్ష్యాన్ని చేధించడానికి బరిలో దిగిన శ్రీలంక కడపటి వార్తలు అందే సరికి 43 పరుగులు చేసి మంచి ఊపులో కనిపిస్తుంది. పెరీరా 23 పరుగులతో, తిరిమర్నె 25 పరుగులతో క్రీజులో ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles