India vs sri lanka match preview

India vs Sri Lanka,live streaming information,Asia Cup 2014,watch live,Match 4 preview,Kohli

India vs Sri Lanka Live Streaming Information with Asia Cup 2014 Match 4 Preview.

శ్రీలంక-భారత్ మ్యాచ్ ప్రివ్యూ

Posted: 02/28/2014 12:09 PM IST
India vs sri lanka match preview

ఆసియా కప్ లో తొలి వన్డేలో బంగ్లాదేశ్ పై గెలిచి భోణి కొట్టిన టీం ఇండియాకు నేడు అసలు పరీక్ష ఎదురు కానుంది. తొలి వన్డేలో మొదట్లో తడబడి ఆ తరువాత కోలుకున్న టీం ఇండియా నేడు మంచి ఫాంలో ఉన్న శ్రీలంకతో తలపడ బోతుంది.

తొలి మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో గెలుపొంది ఆత్మ విశ్వాసంతో ఉండగా, అటు శ్రీలంక కూడా తొలి మ్యాచ్ లో పటిష్టమైన జట్టు పాకిస్థాన్ పై 12 పరుగుల అనూహ్య విజయంతో మంచి ఊపులో ఉంది. ఈ తరుణంలో రెండు జట్లకు నేటి మ్యాచ్ కీలకం కానుంది. ఫైనల్ అవకాశాలు మెరుగుపరుచుకోవాలంటే శ్రీలంక, పాక్ మ్యాచ్ లు కీలకం కానున్నాయి. ఈ తరుణంలో లంక జట్టుపై విజయం సాధించాలని కోహ్లీ సేన పట్టుదలలగా ఉంది.

ఓపెనర్లు రోహిత్, శిఖర్ ధావన్ లు ఫామ్ లోకి వస్తే భారత్ భారీ స్కోరు సాధించే అవకాశాలున్నాయి. భారత బౌలర్లు ధారాళంగా పరుగులు ఇవ్వకుండా కట్టడి చేస్తే భారత్ గెలిచే ఛాన్స్ ఉంది. శ్రీలంక బ్యాటింగ్ లో సంగక్కర ఒక్కడే పెద్దగా అండగా ఉన్నాడు. పాక్ పై సెంచరీ చేసిన ఊపులో ఉన్నాడు. తిరిమానె, కుశాల్, పెరీరా కూడా మంచి ఫామ్ ను కనబరుస్తున్నారు. ఇరు జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ ఆసక్తికరంగా మారనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles