India beat bangladesh by six wickets in asia cup

bangladesh, asia cup, India, Virat Kohli, Virat Kohli 19th century,India beat Bangladesh,

Virat Kohli 19th century, India romped home to a comprehensive six-wicket win over Bangladesh in the second One-Day International (ODI) of the Asia Cup.

మనోళ్ళు బాదేశారు..

Posted: 02/27/2014 10:27 AM IST
India beat bangladesh by six wickets in asia cup

ఆసియాకప్ లీగ్ మ్యాచ్ లో భాగంగా ఖాన్ సాహెబ్ ఉస్మాన్ ఆలీ స్టేడియంలో జరిగిన భారత్ - బంగ్లా లీగ్ మ్యాచ్ లో భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. అగ్రశ్రేణి జట్టు అయిన భారత్ కి బంగ్లా గట్టి పోటీని ఇచ్చింది. బ్యాటింగ్ లోనూ, బౌలింగ్ లోనూ తన అద్బుతమైన ప్రతిభను కనబర్చింది. 279 భారీ స్కోరు చేసిన బంగ్లాకు చివరకు ఓటమి మాత్రం తప్పలేదు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి భారత్ కి అద్భుతమైన విజయాన్ని అందించాడు.  బంగ్లా కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ సెంచరీ తో ఒంటరి పోరాటం చేసి భారీ స్కోరును అందించాడు.

మొదట టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. అనాముల్ హక్ (106 బంతుల్లో 77; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) ఫర్వాలేదనిపిస్తే... బంగ్లా కెప్టెన్ రహీమ్ (113 బంతుల్లో 117; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ చేశాడు.  కెరీర్‌లో రెండో శతకాన్ని పూర్తి చేసుకున్న ముష్ఫికర్ ఇన్నింగ్స్ చివర్లో అవుటయ్యాడు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 4 వికెట్లు పడగొట్టాడు. ఆరోన్, అశ్విన్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ దక్కించుకున్నారు.

బంగ్లా నిర్దేశించిన విజయ లక్ష్యాన్ని చేధించేందుకు బ్యాటింగ్ కి దిగిన భారత్ ఆదిలో కాస్తంత తడబాటుకు గురైంది. ధావన్ (44 బంతుల్లో 28; 5 ఫోర్లు), రోహిత్ (29 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్సర్)లు వరుస ఓవర్లలో అవుట్ కావడంతో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. తరువాత వచ్చిన కోహ్లీ , రహానే నెమ్మదిగా ఆడుతూ.. అవసరం అయినప్పుడు పరుగల వేగాన్ని పెంచాడు. 

మూడో వికెట్‌కు 213 పరుగుల భాగస్వామ్యం నెలకొన్న తర్వాత ఈ జోడి స్వల్ప వ్యవధిలో అవుటయింది. తర్వాత భారత్ విజయ లాంఛనాన్ని రాయుడు (9 నాటౌట్), కార్తీక్ (2 నాటౌట్) పూర్తి చేశారు. రూబెల్, రెహమాన్, రజాక్, గాజి తలా ఓ వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో భారత్ ఆసియా కప్ లో భోణి కొట్టింది. ఆదివారం రోజున పాకిస్థాన్ తో తలపడనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles