3rd day south africa all out for 244

india,south africa, Ishant Sharma,zaheer khan,South Africa were all out, 1st test, ind vs south africa,

South Africa added just 31 runs in the first session on Friday as they were reduced to 244 all out by India on day three of the first Test in Johannesburg.

భారత ఫేసర్లు సఫారీలను ఆడుకున్నారు...

Posted: 12/20/2013 04:18 PM IST
3rd day south africa all out for 244

సఫారీ గడ్డ పై భారత బౌలర్లను ఆడుకోవడం ఖాయం అన్నారు అంతా. వన్డే సిరిస్ నుండి టెస్ట్ సిరీస్ కి వచ్చే సరికి సీన్ మారింది. సఫారీల బౌలర్లను మనవారు ఆడుకోగా, మన ఫేసర్లు బ్యాట్స్ మెన్స్ ను బెంబేలెత్తించారు. భారత్ తో జరుగుతున్న తొలి టెస్టులో సౌతాఫ్రికా బ్యాట్స్మెన్ 244 పరుగులకే కుప్ప కూలారు.

భారత బౌలర్ ఇషాంత్ శర్మ రాణించడం, వెటరన్ ఆటగాడు జహీర్ ఖాన్ నిప్పుల చెరిగే బంతులు వేయడం, యువ బౌలర్ షమీ రాణించడంతో దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ లో మన పై ఆధిక్యాన్ని సంపాదించలేకపోయింది. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 213 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నేడు ఆట ప్రారంభించిన సఫారీలు నేడు 33 పరుగులు మాత్రమే జోడించి మిగతా నాలుగు వికెట్లును కోల్పోయింది. సౌతాఫ్రికా ఆటగాళ్లలో గ్రేమ్ స్మిత్ (68), ఆమ్లా(36), పీటర్ సన్ (21), ఫిలిండర్ (59) పరుగుల మినహా పెద్దగా ఎవరూ ఆకట్టుకోలేదు.

అంతకుముందు మొదటి ఇన్నింగ్స్లో భారత్ 280 పరుగులకు ఆలౌటైంది. క్రమం తప్పకుండా వెంట వెంటనే వికెట్లు కోల్పోవడంతో భారత్ భారీ స్కోరు చేయలేకపోయింది. 255/5 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన టీమిండియా మరో 25 పరుగులకే మిగతా వికెట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles