1st test india all out for 280 in first innings

India vs South Africa, 1st test, India vs South Africa Live, Live Score,Day 2, Vernon Philander, Virat Kohli, MS Dhoni, Dale Steyn, AB de Villiers, Hashim Amla, Morne Morkel, India

Shami Out.Morkel got the last wicket for South Africa in the form of Shami for yet another duck, as India got all out on 280 in their first innings.

టెయిలండర్లు చేతులెత్తేశారు

Posted: 12/19/2013 04:19 PM IST
1st test india all out for 280 in first innings

గతమెంతో గనం... ఇప్పుడు మాత్రం చెప్పుకోవడానికి ఏమీ లేదు. స్వదేశంలో ఇరగదీసిన టీం ఇండియా  సఫారీ గడ్డ పై మాత్రం ఏ మాత్రం రాణించలేకపోతుంది. జోహనెస్ బర్గ్ లో ప్రారంభం అయిన తొలి టెస్టులో భారత్ మొదటి రోజు ఫర్వాలేదనిపించినా రెండో రోజు మాత్రం కేవలం 25 పరుగులు మాత్రమే జోడించి చివరి 5 వికెట్లు కోల్పోయింది.

దీంతో తొలి ఇన్నింగ్స్ లో బారత్ 280 పరుగులకు ఆలౌటయింది. మొదటి రోజు కోహ్లీ సెంచరీతో ఆకట్టుకొని (119) పరుగులు చేసి ఈ మాత్రం స్కోరు చేయడానికి బాటలు వేశాడు. పుజారా 25, రోహిత్ శర్మ 14, ధావన్ 13 పరుగులు చేశారు. మిగతా వారు ఎవరూ రాణించలేక పోయారు. 255/5 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన టీమిండియా మరో 25 పరుగులకే మిగతా వికెట్లు కోల్పోయింది.

అజింక్య రహానే 47, ధోనీ 19 పరుగులు చేశారు. జహీర్ఖాన్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ డకౌటయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫిలాండర్ 4, మోర్కల్ 3 వికెట్లు పడగొట్టారు. స్టెయిన్, కలిస్ చెరో వికెట్ దక్కించుకున్నారు. రెండో రోజు టెయిలండర్లు  వెంట వెంటనే వికెట్లు కోల్పోవడంతో భారత్ భారీ స్కోరు చేయలేకపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles