India south africa series

India tour of South Africa 2013-14, India-South Africa series, South Africa vs India 2013, South Africa vs India, Live cricket score, India vs South Africa, Indian team, Pujara and Kohli enhance India'

India-South Africa series

సఫారీల పై గెలుపు ఆశలు...

Posted: 12/21/2013 01:53 PM IST
India south africa series

దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్‌లో టీమ్‌ఇండియా పట్టుబిగించింది. వన్డేల్లో పరాభవ ప్రభావమో..ఏమో..కానీ టెస్ట్‌లో కుర్రాళ్లు పట్టుదల ప్రదర్శిస్తున్నారు. మూడో రోజు పుజారా, విరాట్‌ భాగస్వామ్యం మ్యాచ్‌ను భారత్‌ శాసించే స్థితిలో ఉంచింది. తక్కువ స్కోరుకే సఫారీలను ఆలౌట్‌ చేసి బౌలర్లు ఇచ్చిన చక్కని అవకాశాన్ని భారత్‌ రెండు చేతులా ఒడిసిపట్టింది. సమిష్టి కృషితో భారత్‌ టెస్ట్‌ మ్యాచ్‌లో గెలుపు దిశగా సాగుతోంది...

 

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత్‌ పటిష్టమైన స్థితిలో నిలిచింది. సఫారీలపై భారీ అధిక్యం సంపాదించే దిశగా భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికాను 244 పరుగులకే అలౌట్‌ చేసిన భారత్‌ క్రికెట్‌ జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరుదిశగా సాగుతుంది. విదేశీ గడ్డపై పుజారా తన తొలి సెంచరీని సాధించగా, రెండో ఇన్నింగ్స్‌లోనూ శతకం సాధించేందుకు కోహ్లీ ఉరకలు వేస్తున్నాడు. దీంతో మూడు రోజు ఆటముగిసే సరికి భారత్‌ ప్రత్యర్థిపై 320 పరుగుల అధిక్యం సంపాదించింది. పుజారా 135 పరుగులతోనూ, విరాట్‌ కోహ్లీ 77 పరుగులతోనూ క్రీజ్‌లో ఉన్నారు.

 

అంతకు ముందు, ఆరు వికెట్ల నష్టానికి 213 పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోరుతో మూడో రోజు ఆటను ఆరంభించిన దక్షిణాఫ్రికా బ్యాట్సమన్‌ భారత బౌలర్ల దాటికి విలవిలాడారు. ఇషాంత్‌ శర్మ లైన్‌ అండ్‌ లెంగ్త్‌ బౌలింగ్‌కు తోడు జహీర్‌ఖాన్‌ నిప్పులు చెరిగే బంతులు సంధించడంతో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు నానా తంటాలు పడ్డారు. ఓవర్‌ నైట్‌ స్కోరుకు మరో 31 పరుగులు మాత్రమే జోడించి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో అలౌట్‌ అయ్యింది. భారత బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా బ్యాట్సమన్‌ మూడో రోజున కేవలం 10 ఓవర్ల ఆటను మాత్రమే సాగించగలిగారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles