Indian aces grand opening international premier tennis league sania mirza mixed double

international premier tennis league, sania mirza, sania mirza latest news, sania mirza mixed double, indian aces team, indian aces, sania mirza bopanna mixed double

indian aces grand opening international premier tennis league sania mirza mixed double

ప్రీమియర్ టెన్నిస్ లీగ్’లో ధ్వజమెత్తిన సానియా జోడీ..

Posted: 11/29/2014 11:36 AM IST
Indian aces grand opening international premier tennis league sania mirza mixed double

ఐపీఎల్ తరహాలోనే టెన్నిస్’లో కూడా మరో కొత్త లీగ్ ప్రారంభమైంది. మహేష్ భూపతి నేతృత్వంలో మొదలైన అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో ప్రస్తుత, మాజీ ఆటగాళ్లు అందరూ కలిసి ఆడుతున్నారు. శుక్రవారంనాడు తెరలేచిన ఈ లీగ్ తొలి అంచె పోటీలు సింగపూర్’లో ఆరంభమయ్యాయి. మొత్తం నాలుగు జట్లు తలపడుతున్న ఈ లీగ్’లో ఇండియన్ ఏసెస్ శుభారంభం చేసింది. ఇందులో భాగంగానే సానియా మీర్జా, రోహన్ బోపన్న మిక్స్’డ్ డబుల్స్’లో విజయం సాధించి జట్టుకు ఘనమైన ఆరంభాన్నిచ్చారు. సానియా మీర్జా, రోహన్ బోపన్న, అనా ఇవనోవిచ్, సాంటోరో, మోన్‌ఫిల్స్‌లతో కూడిన ఈ జట్టు 26-16 స్కోరుతో సింగపూర్ స్లామర్స్‌ను మట్టికరిపించింది.

ముందుగా ఏకపక్షంగా సాగిన పోరులో సానియా జోడి 6-4తో బ్రూనో సోరెన్, డానియెల హంతుచోవను ఓడించింది. ఆ తర్వాత పురుషుల లెజెండ్ సింగిల్స్‌లో ఫాబ్రిస్ సాంటోరో 6-5తో పాట్రిక్ రాఫ్టర్‌ను ఓడించి జట్టు ఆధిక్యాన్ని మరింత పెంచారు. అయితే పురుషుల మిక్స్’డ్ డబుల్స్’లో మాత్రం చుక్కెదురైంది. బోపన్న, మోన్ ఫీల్స్ 2-6తో నిక్ కిర్గియోస్, థామస్ బెర్డిచ్ చేతిలో ఓడిపోయారు. కానీ మహిళల సింగిల్స్‌లో మాత్రం అనా ఇవనోవిచ్ 6-0తో హంతుచోవాను ఓడించింది. ఆ తర్వాత చివరిగా జరిగిన పురుషుల సింగిల్స్‌లో మోన్‌ఫిల్స్ జట్టు విజయాన్ని పరిపూర్ణం చేశాడు. లీటన్ హెవిట్‌ను 6-1 తేడాతో ఓడించడంతో ఏసెస్ పాయింట్లు గణనీయంగా పెరిగాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles