Sania mirza un womens goodwill ambassador south asia special programme new delhi news

sania mirza, sania mirza latest news, sania mirza news, sania mirza hot photos, sania mirza press meet, sania mirza interview, sania mirza goodwill ambassador, UN Womens Goodwill, sania mirza south asia brand ambassador, sania mirza ambassador, south asia special programme, UN Womens Goodwill special programme, sania mirza life history, sania mirza book

sania mirza UN Womens Goodwill Ambassador South Asia special programme new delhi news

సొంతగడ్డపై నిప్పులు చెరిగిన సానియా..

Posted: 11/26/2014 10:45 AM IST
Sania mirza un womens goodwill ambassador south asia special programme new delhi news

ఈమధ్య వరుస విజయాలతో ఫుల్’జోష్’లో వున్న టెన్నిస్ స్టార్ సానియామీర్జా.. తన సొంతగడ్డ అంటే భారతదేశంపై నిప్పులు చెరిగింది. దేశంలో బతకడం చాలా కష్టమని, ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె వెళ్లగక్కింది. అయితే సానియా ఇలా మాట్లాడటానికి అసలు కారణం ఏమిటంటే.. ఓవైపు భారతదేశం ప్రపంచవ్యాప్తంగా అన్నిరంగాల్లోనూ దూసుకుపోతుంటే, సమాజంలో మహిళలకు మాత్రం సరైన గౌరవం దక్కడం లేదు. పైగా అత్యాచారాలరేటు రోజురోజుకూ పెరుగుతూనే వున్నాయి. అసలు మహిళలు ఇంటినుంచి బయటకెళ్తే అసలు తిరిగి వస్తారా..? లేదా..? అన్న టెన్షన్’తోనే ఇంట్లోవాళ్లంతా కాలం గడపాల్సిన పరిస్థితి! దేశంలో మహిళలు వివక్షకు గురువుతూనే వున్నారు కానీ.. వారికి రక్షణ అంటూ లేకుండా పోయింది. ఇటువంటి పరిస్థుతులు ఉద్దేశించే సానియా ఆ విధంగా దేశంమీద నిప్పులు చెరిగింది.

మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఐక్యరాజ్యసమితి (యూఎన్ఐ) సానియాను దక్షణాసియా మహిళల విభాగం గుడ్’విల్ అంబాసిడర్’గా నియమించారు. దక్షణాసియా నుంచి ఈ గౌరవం పొందిన తొలిమహిళగా సానియా గుర్తింపు పొందింది. ఈ కార్యక్రమంలో భాగంగానే సానియా మాట్లాడుతూ.. ‘‘ఈ దేశంలో సానియా మీర్జాలా ఉండటం చాలా కష్టం. మహిళా క్రీడాకారిణిగా నా కెరీర్‌లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నేను మహిళ అయినందుకే ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. ఒకవేళ నేను పురుషుడిగా పుట్టి ఉంటే కొన్ని వివాదాలను తప్పించుకునే అవకాశముండేది’’ అని వ్యాఖ్యానించింది. అంటే.. దేశంలో మహిళలు ఏ స్థాయికి చేరుకున్న వారిని చిన్నచూపుగానే చూస్తున్నారని ఆమె అభిప్రాయాన్ని వెల్లడించింది.

అలాగే.. ‘‘దేశం ఎంతగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ మహిళలకు మాత్రం ప్రాధాన్యం లభించడం లేదు. మహిళలు ఇంకా వివక్షకు గురవుతూనే వున్నారు. వారిని జంతువుల్లా చూస్తున్నారు. మహిళలపై పురుషుల ఆలోచనా ధోరణిలో మార్పు రావాలి. మహిళలు కూడా తమకు ఏమాత్రం తీసిపోకుండా పనిచేయగలరని పురుషులు అర్థం చేసుకోవాలి. క్రీడల్లో మరింత మంది మహిళలు రావాలంటే ఖచ్చితంగా వారి ఆలోచనా ధోరణిలో మార్పు రావాలి. ఈ విషయంలో ప్రభుత్వం కూడా చొరవ చూపాలి. మన సమాజంలో లింగ వివక్ష లేకుండా చేసేందుకు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోంది. ఈ విషయంలో మీడియా పాత్ర కూడా కీలకం’’ అని సానియా తెలిపింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles