Maria Sharapova retires from tennis టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పిన మారియా షరపోవా

Five time grand slam winner maria sharapova announces retirement

Tennis, Maria Sharapova, Womens Tennis Assn, Doping, Injury, russian sports star, five time grand slam winnet, Tennis, Tennis results, Tennis news, Tennis news live, live Tennis, Sports, sports news, score, Tennis score, Tennis live news

Maria Sharapova has announced that she is retiring from tennis with immediate effect. The 32-year-old Russian enjoyed a glittering career that saw her complete a career Grand Slam, win 36 WTA titles, and spend 21 weeks as WTA World No.1.

టెన్నిస్ కు మారియా షరపోవా గుడ్ బై.. రిటైర్మెంట్ ప్రకటిస్తూ భావోద్వేగం..

Posted: 02/26/2020 10:23 PM IST
Five time grand slam winner maria sharapova announces retirement

రష్యా టెన్నిస్‌ స్టార్‌ మారియా షరపోవా ఆటకు గుడ్‌బై చెప్పారు. క్రీడా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ స్టార్‌ ప్లేయర్‌.. ఇవాళ రిటైర్‌మెంట్‌ ప్రకటించారు. ఈ మేరకు... ‘‘28 ఏళ్ల తర్వాత.. ఐదు గ్రాండ్‌ స్లామ్‌ టైటిళ్లు నెగ్గిన నేను... ప్రస్తుతం మరో శిఖరాన్ని అధిరోహించేందుకు సిద్ధమయ్యాను. విభిన్నమైన మైదానంలో పోటీపడబోతున్నాను. టెన్నిస్‌కు గుడ్‌బై చెబతున్నా’’ అని షరపోవా తన నిర్ణయాన్ని వెల్లడించారు. కాగా గతంలో టెన్నిస్‌ నెంబర్‌ 1 ర్యాంకర్‌గా వెలుగొందిన షరపోవా ప్రస్తుతం వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నారు.

పదహారేళ్ల క్రితం టీనేజర్‌గా కోర్టులో అడుగుపెట్టి వింబుల్డన్‌ చాంపియన్‌గా అవతరించి మహిళల టెన్నిస్‌లో మెరుపుతీగలా దూసుకొచ్చిన... ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో ఆమె 373వ స్థానంలో ఉన్నారు. ఈ క్రమంలో 32 ఏళ్ల వయస్సులో బుధవారం ఆమె ఆటకు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా.. ‘‘టెన్నిస్‌కు నా జీవితాన్ని ధారపోశాను. అదే విధంగా టెన్నిస్‌ నాకు జీవితాన్నిచ్చింది. ఇక నుంచి ప్రతిరోజూ నేను దానిని మిస్పవుతాను. ట్రెయినింగ్‌, రోజూ వారీ దినచర్య అంతా మారిపోతుంది. నిద్రలేచిన తర్వాత.. కుడికాలు ముందు.. ఎడమ కాలు పెట్టి షూలేసులు కట్టుకోవడం.. మొదటి బాల్‌ను కొట్టే ముందు కోర్టు గేటును మూసివేయడం వంటి వాటికి దూరం అవుతున్నాను.

‘‘ఇంకా నా టీం అంతటినీ మొత్తం మిస్సవుతాను. నా కోచ్‌లను కూడా. మా నాన్నతో కలిసి కోర్టు బెంచ్‌ మీద కూర్చునే క్షణాలు అన్నీ మిస్సవుతాను. ఓడినా.. గెలిచినా.. పరిచయం ఉన్నా లేకపోయినా... ఇచ్చిపుచ్చుకునే షేక్‌హ్యాండ్లు, వెన్నుతట్టి ఆటలో నన్ను ప్రోత్సహించిన వారిని మిస్సవుతాను. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే.. టెన్నిస్‌ ఓ పర్వతంలా కనిపిస్తోంది. నా దారి అంతా లోయలు, మలుపులతో నిండి ఉంది. అయితేనేం.. శిఖరం అంచు నుంచి చూస్తే అపురూపమైన ఘట్టాలు ఎన్నో కనిపిస్తున్నాయి’’అంటూ షరపోవా భావోద్వేగానికి గురయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maria Sharapova  Womens Tennis Assn  Retirement  Russian sports star  Tennis  Sports  

Other Articles

  • India s sumit nagal puts up a good fight against roger federer

    ఫెదరర్ కు చమటలు పట్టించిన నాగల్.. తొలిసెట్ విజయం

    Aug 27 | 20 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత, ప్రపంచ మాజీ నెంబర్‌వన్, స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు యూఎస్ ఓపెన్‌లో ఊహించని షాక్ తగిలింది. అయితే వెంటనే కొలుకున్నాడు కానీ.. తొలి సెట్ మాదిరిగానే మిగతా మ్యాచ్... Read more

  • Serena williams backed over umpire sexism claim after 17k fine

    సెరెనా విలియమ్స్ కు పెరుగుతున్న మద్దతు..

    Sep 10 | యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో ఓడిమిని చవిచూడటంతో.. అంపైర్ పై విరుచుకుపడిన అమెరికా క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ పై టోర్నమెంట్ రిఫరీ కార్యాలయం భారీ జరిమానా విధించిన నేపథ్యంలో అమె చేసిన... Read more

  • Icc and wimbledon banter on twitter after roger federer plays cricket stroke

    టెన్నిస్ స్టార్ కు ఐసిసి ఫస్ట్ ర్యాంకు

    Jul 10 | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) క్రికెట్ లో అద్భుతమైన ఆట కనబర్చిన క్రికెటర్లకు ర్యాంకులు కేటాయించే విషయం ప్రతీ క్రికెట్ అభిమానికి తెలిసిందే అయితే తాజాగా ఐసీసీ ఓ టెన్నిస్ సూపర్ స్టార్ కి టెస్టుల్లో... Read more

  • Sania mirza shuts down twitter troll for calling her non indian

    నెట్ జనుడికి సానియా మైండ్ బ్లాక్ జవాబు..

    Apr 13 | పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లాడి ఎనమిది వసంతాలు పూర్తి చేసుకున్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను ఓ వ్యక్తి నీ దేశం ఏదీ అంటూ ప్రశ్నించి.. అమె అగ్రహానికి గురయ్యాడు. అంతేకాదు... Read more

  • Doubts turn to desperation after andy murray s lost six months

    అండీ ముర్రేకు గాయాలు.. అభిమానల అందోళన

    Jan 05 | బ్రిటన్‌ స్టార్‌ టెన్నిస్‌ ప్లేయర్‌, ప్రపంచ మాజీ నంబర్‌ వన్‌, 3సార్లు గ్రాండ్‌ స్లామ్‌ ఛాంపియన్‌ ఆండీ ముర్రే కెరీర్‌పై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది వింబుల్డన్‌ క్వార్టర్‌ ఫైనల్లో ఓడిన ముర్రే గాయం... Read more