Sania mirza shoaib malik divorce rumors

sania mirza shoaib malik divorce, shoaib malik sania mirza issues, sania mirza shoaib malik differences, sania mirza on shoaib malik, shoaib malik on marriage life, sania mirza latest news updates, pakistan sports latest, india pakistan relations

sania mirza shoaib malik divorce rumors : fans of sania mirza suspects that indian tennir star may get divorce with shoaib malik, indian player pakistan sports man may comes to end their combined life soon with many of personal reasons

పెళ్ళి బంధానికి బీటలు... కూలిపోనున్న కలల సౌధం...?

Posted: 12/11/2014 04:38 PM IST
Sania mirza shoaib malik divorce rumors

అద్దాల మేడ త్వరలో కూలిపోనుంది. ప్రేమ పేరుతో కట్టుకున్న సౌధం సమాధికి సిద్దమవుతోంది. ఎన్నో అవాంతరాలు, వివాదాలు, విమర్శలను దాటుకుని ఏర్పడిన బంధం ఎడబాటు దిశగా అడుగులు వేస్తోంది. భారత్- పాక్ కుటుంబ బంధం విడిపోయేందుకు ఆలోచనలు చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. కొద్ది నెలల నుంచి జరుగుతున్న పరిణామాలు గమనిస్తే.., భారత టెన్నిస్ స్టార్ ఐకాన్ సానియా మిర్జా.., పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ దాంపత్య జీవితం రోజురోజుకూ పలుచనవుతోంది. దేశాల ఎల్లలను దాటుకుని ఒక్కటైన వీరిద్దరూ... ఇప్పుడు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. కుటుంబ జీవితం కంటే వ్యక్తిగత జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

సానియా మిర్జా-షోయబ్ మాలిక్ పెళ్లి వారి రెండు కుటుంబాలకే కాదు... రెండు దేశాలకు ఎప్పటికి గుర్తుండిపోయే అంశం. సోదర దేశాలుగా ఉండే భారత్- పాక్ మద్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేం శత్రుత్వం కూడా ఉంది. ఈ పరిణామాల మద్య ప్రేమాయణం నడిపిన ఇద్దరు క్రీడా స్టార్లు పెళ్ళికి సిద్దపడ్డారు. హైదరాబాదీ అల్లుడయ్యేందుకు షోయబ్ సిద్దపడగా.., పాక్ కోడలయ్యేందుకు సానియా ఫ్యామిలీని ఒప్పించింది. పలు సంఘాల అభ్యంతరాలు, మతవాదులు, జాతీయ వాదుల విమర్శల మద్య సానియా- షోయబ్ పెళ్లి జరిగింది. ఆ తర్వాత అల్లుడు అప్పుప్పుడూ హైదరాబాద్ కు వచ్చి నగర ఆతిధ్యం స్వీకరించాడు.

పెళ్లి తర్వాత కొన్నాళ్ళ వరకు హైదరాబాద్ టు సైలా కోట్ వయా ముంబై లేదా ఢిల్లీ అన్నట్లుగా వీరి ప్రయాణం సాగింది. దంపతులిద్దరూ బాగానే ఉన్నారు. ఇదే సమయంలో కెరీర్ పై దృష్టి తగ్గినట్లు విమర్శలు రావటంతో అలర్టయ్యారు. ఇంటిపై ధ్యాసను పక్కనబెట్టి.., ప్రాక్టీస్ పెంచారు. ఇదే సమయంలో ఇద్దరి మద్య దూరం పెరిగింది. ప్రపంచంలో అన్ని విషయాలపై వివరణ ఇస్తున్న సానియా.. పెళ్లి అనే మాటపై నోరు మెదపటం లేదు. అటు షోయబ్ కూడా షాది అంటే మాట్లాడకుండా సైడ్ అయిపోతున్నాడు. దీంతో వీరిద్దరి మద్య బ్రేకప్ కాల్ మోగటం ఖాయంగా రూమర్లు వస్తున్నాయి.

సోమవారం రోజు ఢిల్లీలో జరిగిన ఓ పార్టీలో సానియా రోజర్ ఫెదరర్, రోహన్, మహేష్ భూపతి, రితేష్ తో కలిసి బిజీగా ఉంటే.., హుమానియా మాలిక్ ఆమె కుటుంబ సభ్యులతో షోయబ్ కరాచీలో ఉన్నాడు. ఇది వ్యక్తిగత కార్యక్రమాలు అనుకుంటే.., షోయబ్ తో కలిసి సన్నిహితంగా ఉన్నట్లు దిగిన ఓ ఫోటోను ఆ మద్య పోస్ట్ చేసిన సానియా.. కొద్ది రోజుల క్రితం తొలగించింది. అంతేకాదు.., ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.., ‘నా కెరీర్ కు సహకరించిన కుటుంబ సభ్యులు, కోచ్, జట్టు క్రీడాకారులు, ఫ్యాన్స్ కు ధన్యవాదాలు’ అని తెలిపింది. కాని జీవితాంతం తోడు ఉండాల్సిన భర్త గురించి చెప్పలేదు.

అటు సానియాతో కలిసి ఉన్న ఫోటోలు పోస్ట్ చేయటం లేదని నెట్ లో ప్రశ్నిస్తున్న ఫ్యాన్స్ కు ‘ ఆ విషయం సానియాను అడగండి’ అని షోయబ్ పోస్ట్ చేశాడు. పండగల సమయంలో కూడా సానియా ఎక్కువగా చార్మినార్ సిటీలో ఉంటుండగా.., షోయబ్ పరాయి దేశంలో పండగ చేసుకుంటున్నాడు. దీంతో పెళ్ళి బంధం బీటలు వారుతున్నట్లు అనుకుంటున్నారు. ఈఏడాదిలో వీరిద్దరూ ఎక్కువగా కలిసున్న సందర్బాలు చాలా తక్కువ. ఇందుకు వరుసగా వస్తున్న మ్యాచ్ లు, టోర్నీలు కారణం కావచ్చు. కానీ.., ఖాళీగా ఉన్న సమయంలోనూ ఎవరి పనుల్లొ వారు ఉండటంతో టైటానిక్ షిప్ అవుతుందేమో అని వీరిద్దర్నీ గమనిస్తున్న నెటిజన్లు కామెంట్ చేసుకుంటున్నారు.

ఈ ఊహాగానాలు ఎంతవరకు నిజమనేది కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఇదే నిజమైతే కేవలం.., ఇద్దరు వ్యక్తులు, రెండు కుటుంబాలకు సంబంధించిన అంశంగా దీన్ని చూడలేము. సమస్యలు వస్తే సర్ధుకుపోవాలి లేదా.., పరిష్కరించుకోవాలి. కాని విడిపోవటమే పరిష్కారం కాదు. ఇదే సొల్యూషన్ అయితే ప్రపంచంలో ఆడ మగ అని ఉంటారు తప్ప.. భార్య-భర్త అనే అదృశ్య శక్తి కన్పించదు. ఏదేమైనా ఎల్లలు దాటిన వీరి ప్రేమ ఎప్పటికి నిలవాలనీ..., పవిత్ర పెళ్లి బంధం కలకాలం కొనసాగాలని ‘తెలుగు విశేష్’ కోరుకుంటోంది.

కార్తిక్
(content courtesy : TOI)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sania mirza divorce  shoaib malik latest  india pakistan relations  

Other Articles