Sania mirza says her james bond is shoaib malik

sania mirza, sania mirza latest news, sania mirza hot photos, sania mirza park hayat hotel, sania mirza photo shoot, sania mirza shoaib malik, sania mirza husband shoaib malik, pierce brosnan news

sania mirza says her james bond is shoaib malik ; sania mirza visits banajahills park hayat for private party. In that party she shares her some personal feelings about movies and her auto biography

తెలంగాణ బ్రాండ్.. పాకిస్తాన్ బాండ్..

Posted: 11/22/2014 11:20 AM IST
Sania mirza says her james bond is shoaib malik

తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్’గా ఎంపికైనప్పటినుంచి వరుస విజయాలతో పతకాలను సొంతం చేసుకున్న టెన్నిస్ స్టార్ సానియామీర్జా... ఆ విజయాలను ఎంతో సంతోషంగా అనుభవిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే.. ఈ అమ్మడు నిత్యం వార్తల్లో నిలిచిపోతోంది. ఒకప్పుడు వరుస పరాభవాలను ఎదుర్కొన్నప్పుడు ఎవరూ అంతగా పట్టించుకోలేదుగానీ.. ఇప్పుడు మాత్రం ఆమె కనిపిస్తేచాలు, ఏదో ఒక వార్త బయటకు వచ్చేస్తోంది. ఈమధ్య ప్రైవేటు కార్యక్రమాల్లో తెగతిరగేస్తున్న ఈ అమ్మడు.. తాజాగా శుక్రవారం బంజారాహిల్స్’లోని పార్క్’హయత్ హోటల్’లోని ఓ కార్యక్రమానికి హాజరయ్యింది. ఆ నేపథ్యంలోనే ఈ క్రీడాకారిణి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

ఇటీవలే సానియాపై సినిమా తెరకెక్కించే అవకాశాలున్నాయనే వార్తలు జోరందుకున్న విషయం తెలిసిందే! అయితే తన జీవిత ఆధారంగా సినిమా రావడం ఇష్టంలేదని స్పష్టం చేసినా... ఒకవేళ తన పాత్రను దీపిక పదుకొనె చేస్తే ఓకే అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిఇవ్వనట్లు చెప్పేసింది. కానీ ఫ్యాషన్ షోలతోబాటు ప్రైవేటు కార్యక్రమాల్లో కుందనపు బొమ్మలా తయారయై రావడాన్ని.. ‘‘మీరు సినిమాల్లో రావాలనుకుంటున్నారా..?’’ అనే ప్రశ్నలను సంధిస్తున్నారు. తనకు సినిమాలు చూడటం ఇష్టమే గానీ.. సినిమాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని మరోసారి తేల్చిపారేసింది. ఆటకు, నటనకు చాలా తేడా వుందని చెప్పిన ఆమె.. టెన్నిస్’కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని చెప్పింది.

‘‘మరి మీకు ఇష్టమైన హీరో ఎవరు..?’’ అని అడిగిన ప్రశ్నకు ఆమె.. ‘‘జేమ్స్ బాండ్ పాత్ర పోషించిన హీరోల్లో పియర్స్ బ్రాస్నన్ అంటే చాలా ఇష్టమేకానీ.. నా జేమ్స్ బాండ్ మాత్రం మా ఆయనే.. ప్రస్తుతం ఆయన (షోయబ్ మాలిక్’ పాకిస్తాన్ లో వున్నాడు’’ అని చెప్పింది. ఇక తన ఆత్మకథ పుస్తకం గురించి మాట్లాడుతూ.. ఇంకా రెండేళ్ల విషయాలను పునరావృతం చేసుకుని రాయాల్సి వుందని.. అది ఎప్పుడు బయటకు వస్తుందో చెప్పలేనని ఆమె పేర్కొంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sania mirza  shoaib malik  pierce brosnan  james bond  banjarahills park hayat  

Other Articles