ఇప్పటి వరకు ఐపీఎల్ లో ఎక్కువ టైటిళ్ళు గెలుచుకోవడమే కాకుండా, అంత్యంత బలమైన జట్టుగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం స్సాట్ ఫిక్సింగ్ కేసులో ఇరుక్కున్న నేపథ్యంలో ఆ జట్టును రద్దు చేయాలని పలువురు డిమాండ్ చేయడమే కాకుండా, బీసీసీఐ నిబంధనల ప్రకారం ఐపీఎల్ కి చెడ్డపేరు తీసువచ్చే ఏ పనులు జట్టు యాజమాన్యం, సభ్యులు కానీ చేస్తే ఆ ఫ్రాంఛైజీని రద్దు చేసే అధికారం బీసీసీఐకి ఉంటుంది. మరి ఆ నిబంధనను చెన్నై జట్టుకు ఓనర్ క్రికెట్ పెద్ద అయిన బీసీసీఐ శ్రీనివాసన్ అల్లుడు కావడం చేత, ఈ నిబంధనను అమలు చేస్తారా ? అమలు చేస్తే జట్టు రద్దు కాబోతుందా ? ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతుంది. అయితే చెన్నై ఫ్రాంఛైజీ యాజమాన్యం మాత్రం గురునాథన్ తన జట్టుకు సీఈఓ కాదని, కనీసం టీం ప్రిన్సిపల్ కూడా కాదని , అతను నిర్వహణ సభ్యులలో ఒక్కడు మాత్రమే అని తేల్చి చెప్పింది. అయితే ఆ ఫ్రాంఛైజీ వాదనలు ఎలా ఉన్నా ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న చెన్నై జట్టును పూర్తిగా రద్దుచేసి ఆ స్థానంలో కొత్తగా వేలం నిర్వహించాలని లలిత్ మోడీ డిమాండ్ చేశారు. ఇతనే కాకుండా చాలా మంది ఈ ఫ్రాంఛైజీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈనేపథ్యంలో ఐపీఎల్ నుండి చెన్నై జట్టు కనుమరుగు కానుందా ? అంటే అవుననే అంటున్నాయి క్రికెట్ వర్గాలు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more