ఐపీఎల్ ప్రారంభం అయి ఆరు సంవత్సరాలు అయింది. మ్యాచ్‌ను ఒంటి చేత్తో మార్చగల హిట్టర్లు, ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను వణికించే పేసర్లు ఉన్నా ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పటిదాకా గెలుచుకోలేదు. ఇక క్రికెట్ దేవుడికి కూడా ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంటే తీరని కోరికల్లో ఒక్కటి తీరిపోతుంది. మరి ఇవన్నీ తీర్చుకునే సమయం ఆసన్నమైంది. నిన్న రాత్రి రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన క్వాలిఫైయర్ మ్యాచ్ లో ముంబై నాలుగు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్లో అడుగు పెట్టి చెన్నైతో అమీతుమీ తేల్చుకోనుంది. వర్షం కారణంగా గంట ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 165 పరుగులు చేసింది. కెప్టెన్ ద్రవిడ్ (37 బంతుల్లో 43; 7 ఫోర్లు), రహానే (18 బంతుల్లో 21; 3 ఫోర్లు) శుభారంభాన్ని ఇచ్చినా మిడిలార్డర్ విఫలమవ్వడంతో ఓ దశలో 108కే ఆరు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. అయితే చివర్లో బ్రాడ్ హాడ్జ్ (20 బంతుల్లో 19 నాటౌట్ ; 2 ఫోర్లు), యాగ్నిక్ (17 బంతుల్లో 31 నాటౌట్; 5 ఫోర్లు) చెలరేగడంతో 5 ఓవర్లలో 61 పరుగులు చేరి గట్టి స్కోరు సాధించగలిగింది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 169 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మిత్, ఆదిత్య తారే (27 బంతుల్లో 35; 3 ఫోర్లు; 2 సిక్స్) ధాటిగా ఆడడంతో తొలి వికెట్‌కు 70 పరుగులు జత చేరాయి. ఆ తర్వాత కూడా స్మిత్ జోరు కొనసాగడంతో 38 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. వరుస విరామాల్లో నాలుగు వికెట్లు పడ్డాయి. దీంతో చివరి రెండు ఓవర్లలో 23 పరుగులు రావాల్సి ఉండడంతో ముంబై శిబిరంలో ఆందోళన నెలకొంది. వాట్సన్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో 8 పరుగులు రావాల్సిన దశలో రాయుడు (17) వికెట్ పడినా రిషి ధావన్ (4), హర్భజన్ (6) విజయాన్ని అందించారు. ముంబై 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు సాధించి 4 వికెట్ల తేడాతో విజయం సాధించి చెనై్నతో ఫైనల్ పోరుకు సిద్ధమైంది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more