ఎంతటి ఘనమైన జట్టుకైనా పరాభవం తప్పదు. ఇప్పటికే రెండు ఐపీఎల్ టైటిళ్ళు, ఐరుసార్లు ఫైనల్ కి వచ్చిన చెన్నై జట్టు ఊపును చూస్తే కప్ ఈ సారి కూడా వాళ్ళకే అనుకున్నారు అంతా. క్వాలిఫైయింగ్ మ్యాచ్ లో ముంబయిని దారుణంగా ఓడించి ఫైనల్ కి వచ్చిన చెన్నై జట్టు పై అంచనాలు భారీగానే ఉన్నాయి. కానీ సరిగ్గా ఫైనల్ కి రెండు రోజుల ముందు ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న చెన్నై జట్టు తీవ్ర ఒత్తిడికి లోనై, ఫైనల్లో ముంబయి పై ఓడిపోయి టైటిల్ ని చేజార్చుకుంది. ఇక ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా సాధించని ముంబయి జట్టు ఎలాగైనా ఈ టైటిల్ ని గెల్చి, తన కలను నెరవేర్చాలనుకున్నారు. దీని కోసం జట్టు యాజమాన్యం ధారాళంగా పైసలు కూడా ఖర్చు పెట్టింది. ఎట్టకేలకు జట్టుకు టైటిల్, కాసుల వర్షాన్ని కురిపించి తొలిసారి ఐపీఎల్ టైటిల్ ని నెగ్గారు.
లీగ్ మ్యాచ్ ల్లో, క్వాలిఫైయర్ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన ఈ జట్టు నిన్న రాత్రి కోల్ కత్తా ఈడెన్ గార్డెన్ లో ఫైనల్ మ్యాచ్ లోతలబడ్డాయి. ఇందులో చెన్నై ఆఖరి మెట్టుపై బోల్తాపడింది. ముంబై ఇండియన్స్ 23 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి తొలిసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ ఆదిలోనే టపటపా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ పోలార్డ్ ఒంటరి పోరాటం (32 బంతుల్లో 60 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు)లతో , రాయుడు (36 బంతుల్లో 37; 4 ఫోర్లు), దినేశ్ కార్తీక్ (26 బంతుల్లో 21; 3 ఫోర్లు) రాణించడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 148 పరుగులు సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్లకు 125 పరుగులు చేసి ఓడింది. కెప్టెన్ ధోని (45 బంతుల్లో 63 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) రాణించినా... మిగతా వారు పూర్తిగా విఫలమయ్యారు. హస్సీ (1), రైనా (0), బద్రీనాథ్ (0)లు ఏడు బంతుల వ్యవధిలో అవుట్ కావడం జట్టును దెబ్బతీసింది. రాణిస్తున్న మైక్ హస్సీ, రైనాలు, జడేజాలు పరుగులేమి చేయకుండా పెవీలియన్ చేరడంతో చెన్నై ఓటమి ముందు తలవంచక తప్పలేదు. ముంబై బౌలర్లలో మలింగ, జాన్సన్, హర్భజన్ రెండేసి వికెట్లు తీశారు. ఈ టైటిల్ సాధించడంతో ముంబై కల నెరవేరింది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more