నిత్యం రద్దీగా ఉండే దిల్‌సుఖ్‌నగర్ ప్రధాన కూడలి ఒక్కసారిగా జరిగిన బాంబు పేలుళ్లతో మరుభూమిగా మారింది. జంట పేలుళ్లతో నగరం ఉలిక్కిపడింది. గురువారం రాత్రి ఏడు గంటల సమయంలో ఎవరి హడావిడిలో వారు ఉండగా రెండు చోట్ల బాంబులు పేలాయి. వెంకటాద్రి థియేటర్ వద్ద ఉన్న 107 నెంబర్ బస్‌స్టాప్ వద్ద 7.01 గంటలకు భారీ శబ్దం వినిపించింది. ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. తేరుకునే లోపు కొందరు రక్తపు మడుగులో విగత జీవులై పడి ఉన్నారు. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.. మరికొందరు కాళ్లు, చేతులు కోల్పోయి ఆర్త నాదాలు చేస్తున్నారు. చుట్టుపక్కల జనం పరుగులు తీస్తుండగానే ఈ ప్రదేశానికి సరిగ్గా 100 మీటర్ల దూరంలో మరో భారీ శబ్దం 7.03 గంటలకు వినిపించింది. 107 బస్‌స్టాప్ వెనుక హీరోహోండా మోటార్ సైకిల్‌కు తగిలించిన బ్యాగులో బాంబు పేలిందని స్థానికులు చెబుతున్నారు. రాజీవ్ చౌక్ వద్ద ఉన్న రమేష్ టీ కార్నర్ వద్ద టిఫిన్ బాక్స్‌లో బాంబు పెట్టారు. దాన్ని సైకిల్‌కు అమర్చారు. ఇక్కడ మొత్తం ఎనిమిది మంది మృతి చెందారని తేల్చారు.
సుమారుగా 7 గంటలకు ఈ పేలుడు జరిగిందని నిర్ధారించారు. రెండు పేలుళ్లలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. దాదాపు 80 మంది క్షతగాత్రులయ్యారు. కొంతమంది ఆసుపత్రులకు తరలిస్తుండగా మరణించారు. ఎంత మంది మృతి చెందారనే దానిపై అర్ధరాత్రి దాటే వరకూ స్పష్టత రాలేదు. ప్రమాదం నుంచి తేరుకున్న జనం పోలీస్ కంట్రోల్ రూమ్‌కు, ఆస్పత్రులకు ఫోన్లు చేసి సమాచారం ఇచ్చారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడంలో సహకరించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందాలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. మరో వైపు నేషనల్ ఇన్విస్టిగేషన్ బ్యూరో, రాష్ట్ర ఇంటిలిజెన్స్ బ్యూరో, ఆక్టోపస్ బృందాలు బాంబులు పేలిన చోట తనిఖీలు చేపట్టాయి. అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలెర్ట్ ప్రకటించింది. అప్పటికే బాంబు పేలుళ్ల వార్తలు దావానలంలా వ్యాపించాయి. ఇతర ప్రాంతాల్లో ఉన్న బంధు మిత్రులు క్షేమ సమాచారం తెలుసుకోవడానికి యత్నించారు. బాంబు సంఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. కొంత సేపటి తర్వాత సెల్‌ఫోన్లు జామైపోయాయి.
భయానక వాతావరణం .. ఏంటీ ఈ శబ్దాలు.. అని అనుకునేంతలో గాల్లో ఎగిరిన శరీరాలు ముక్కలుగా కింద పడ్డాయి. రక్తపు చారికలు, తెగిపడిన అవయవాలు, బాధితుల హాహాకారాలు. ఇదీ జంట పేలుళ్ల అనంతరం సంఘటనా స్థలాల్లోని పరిస్థితి. రెప్పపాటులో జరిగిన పేలుళ్లతో అప్పటివరకు సందడిగా ఉన్న ఆ ప్రాంతంలో శ్మశాన వాతావరణం కనిపించింది. రాజీవ్‌చౌక్ వద్ద మాంసపు ముద్దలు, పేగులు, తెగిపడిన శరీరభాగాలు... పేలుడు తీవ్రతకు నిదర్శనం. లుంబినీ -గోకుల్ తరహాలో ..! జంట పేలుళ్లతో నగరం చిగురుటాకులా వణికిపోయింది. ఆరేళ్ల క్రితం లుంబినీ -గోకుల్ ఛాట్ తరహాలో జరిగిన పేలుళ్లతో నగరం ఉలిక్కిపడింది. రెండు నిముషాల వ్యవధిలో పేలిన టైమర్ బాంబుల ధాటికి బేంబేలెత్తిపోయింది. దిల్‌సుఖ్‌నగర్‌లో గురువారం జరిగిన జంట పేలుళ్లకు, గతంలో లుంబినీ-గోకుల్ చాట్‌ల వద్ద జరిగిన పేలుళ్లకు మధ్య సారుప్యం ఉంది. అప్పట్లో దిల్‌సుఖ్‌నగర్ బస్టాప్‌లో ఉంచిన బాంబును పోలీసులు నిర్వీర్యం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సారి మాత్రం ఉగ్రవాదుల బారి నుంచి తప్పించుకోలేకపోయింది. పేలుళ్లకు టైమర్ బాంబులను వినియోగించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఇది ఇండియన్ ముజాహిదీన్ పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు.
బంధువుల ఆందోళన .. సంఘటన సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నించిన వారు ఇబ్బందులు పడ్డారు. దిల్‌సుఖ్‌నగర్ పరిసర ప్రాంతాల్లో నివసించే వారికి ఫోన్ చేయడానికి యత్నిస్తే పని చేయలేదు. బాంబు దాడి తర్వాత సమాచార వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది. కొందరు టీవీ చానెళ్ల కార్యాలయాలకు, పత్రికా కార్యాలయాలకు ఫోన్లు చేసి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేశారు.మరో బాంబు కలకలం.. వనస్థలిపురంలో మరో బాంబు గుర్తించినట్టు జరిగిన ప్రచారం స్థానికంగా మరింత కలకలం సృష్టించింది. ఆ ప్రాంతంలోని సంపూర్ణ థియేటర్ వద్ద రోడ్డుపైపడి ఉన్న బ్యాగును చూసి బాంబుగా అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన బాంబు స్క్వాడ్ అక్కడ తనిఖీలు చేసింది. బ్యాగులో పేలుడు పదార్థాలు ఏవీ లేవని నిర్థారించిన తర్వాత ఊపిరి పీల్చుకున్నారు.
రోడ్లు నిర్మానుష్యం .. జంట పేలుళ్లు నేపథ్యంలో.. ప్రజలు ఉరుకులు పరుగులతో ఇళ్లకు చేరడం ప్రారంభించారు. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. సాయంత్రం ఎనిమిది గంటల తర్వాత కూడా సందడిగా ఉండే ట్యాంక్ బండ్, నెక్లెస్‌రోడ్డు వంటి ప్రాంతాలు జన సం చారం లేకుండా నిర్మానుష్యంగా మారాయి. ఇదే పరిస్థితి ఇంచుమించు అన్ని ప్రాంతాల్లో కనిపించింది. ఆ షాపులో... రమేష్ టీ కార్నర్, మిర్చి బజ్జిల కొట్టులో ఏడెనిమిది మంది వరకు పనిచేస్తారని స్థానికులు చెప్తున్నారు. పేలుళ్ల అనంతరం వారి జాడ కనిపించ లేదు. అక్కడ పనిచేస్తోన్న వారిలో ఎంత మంది చనిపోయారు..? గాయపడిన వారెందరు..? అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. బాంబు పేలుడు ధాటికి దుకాణం మొత్తం ధ్వంసమైంది. రెండో అంతస్తు వరకు ఉన్న హోర్డింగ్ కూడా ధ్వంసమైంది.
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more