ఉస్మానియా ఆస్పత్రి.. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన పెద్ద దవాఖానా. కనీస వై ద్యానికీ ఠికానా లేదిక్కడ.. రోగులకు భరోసా లభించదిక్కడ. బాధితులను తరలించేందుకు స్ట్రేచర్లుండవు. సెలైన్ బాటిళ్లు పెట్టేందుకు స్టాండ్లు కనిపించవు. చివరికి ఊపిరి పోసే ఆక్సిజన్ సైతం అందుబాటులో ఉండదు. క్షతగాత్రుల ప్రాణాలు ఇక్కడ గాల్లో దీపమేనని మరోసారి తేలిపోయింది. గురువారం దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో వంద మం దికి పైగా గాయపడ్డారు. వారిలో రాత్రి 10 గం టల వరకు సుమారు 40 మందిని ఇక్కడికి తరలించారు.క్షతగాత్రుల హాహాకారాలతో ఆస్పత్రి ప్రాంగణం మార్మోగింది. వీరికి క్యాజు వాల్టీలో ప్రాథమిక చికిత్స అందించినా.. పడుకొనేందుకు కనీసం పడకలు లేకపోవడంతో వరండాల్లోని బల్లాలపై పడుకోవాల్సి వచ్చిం ది. సెలైన్ స్టాండ్స్ రోగులు ఒక చేత్తో బాటిళ్లు.. మరోచేత్తో రక్తమోడుతున్న శరీర భాగాలను అదిమిపట్టుకున్న దృశ్యాలు కనిపించాయి. కా నీ, మందుల్లేక, మౌలిక సదుపాయాల్లేక వైద్యు లు కేవలం దూదితో కట్టుకట్టి చేతులు దులుపుకున్నారు. చివరకు, మెరుగైన వైద్య సేవల పే రుతో.. 28 మంది క్షతగాత్రులను శుక్రవారం తెల్లవారుజామున నాంపల్లి కేర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇక్కడ నలుగురికి మా త్రమే వైద్య సేవలందిస్తుండడం.. ఆస్పత్రిలో లభిస్తున్న వైద్య సేవల తీరుకు నిదర్శనం.
ఆస్పత్రిలో పన్నెండు ఆపరేషన్ థియేటర్లు ఉం డగా, వీటిలో ఇప్పటికే రెండు థియేటర్లు మూ త పడ్డాయి. మరో ఆరు శిథిలావస్థకు చేరాయి. కేవలం నాలుగు మాత్రమే సర్జరీలకు అనుకూలంగా ఉన్నాయి. రేడియాలజీ విభాగంలో పది ఎక్సరే యంత్రాలు ఉండగా, ఇప్పటికే సగం మూలన పడ్డాయి. పది రోజులుగా సీటీస్కాన్ పని చేయట్లేదు. దీంతో కొంత మంది క్షతగాత్రులను అర్ధరాత్రి గాంధీకి తరలించారు. అత్యవసర సమయాల్లో ప్రాణాలు నిలిపే వెంటిలేటర్లు కూడా ఇక్కడ అరకొరగానే ఉన్నాయి. ఆరు వెంటి లేటర్లు ఉంటే, నాలుగే పని చేస్తున్నాయి. ఎండోస్కోపీ, 2డి ఎకో యంత్రాలు తరచూ మోరాయిస్తున్నాయి. 2డి ఎకో పరీక్షల కోసం రోజుకు వంద మంది వస్తే కేవలం 50 మందికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారు. డిఫిబ్రిలేటర్స్ రెండు ఉండగా అందులో ఒకటి పనిచేయడం లేదు. 10 ఈసీజీ యంత్రాలకు గాను ఏడు పనిచేయడం లేదు. బెడ్‌సైడ్ మానిటర్స్ 10 ఉండగా, ఐదు మొరాయించాయి. పది అంబులెన్స్‌లు ఉంటే.. పని చేసేది ఒక్కటే. ఇదీ ఘనత వహించిన ఉస్మానియా దుస్థితి.
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more