Nara lokesh counter on ys jagan

nara lokesh satire on ys jagan, nara lokesh vs ys jagan, nara lokesh fire on ys jagan, lokpall bill, telangana bill, nara lokesh counter on ys jagan, nara lokesh,ys jagan, minister ponnal lakshmaiah, political news, latest telugu news, breaking news, headlines

nara lokesh counter on ys jagan

జగన్ కు నారా లోకేష్ సవాల్

Posted: 12/18/2013 08:16 PM IST
Nara lokesh counter on ys jagan

నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో పరిశ్రమ పెట్టాలంటే ప్రతి ఒక్కరూ లంచం అడుగుతున్నారని వ్యాపారాలు వాపోతున్నారని, అవినీతిని అరికడితేనే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఆదాయం పెరగినట్లు ఉద్యోగాలు ఎందుకు పెరగటం లేదని, 2004 తర్వాత ప్యాబ్ సిటీలో ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా అంటూ ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు, వైఎస్ పాలనలో అభివృద్ధిపై చర్చకు జగన్మోహన్‌రెడ్డి సిద్ధమా? అంటూ లోకేష్ నాయుడు సవాల్ చేశారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో చంద్రబాబుపై 37 కేసులు పెట్టారు, ఒక్కటీ కూడా నిరూపించలేదని ఆయన పేర్కొన్నారు.

 

మంత్రి పొన్నాలకు హైకోర్టులో ఊరట

ఎన్నికల ఫలితాల వెల్లడిలో అక్రమాలు జరిగాయని, ఓడిన పొన్నాల లక్ష్మయ్యను గెలుపొందినట్లు ప్రకటించారని, ప్రతాప్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా, పొన్నాల ఎన్నికపై 2010లో కోర్టు సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈ తీర్పును పొన్నాల సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. విచారణపై అదే ఏడాది సుప్రీంకోర్టు స్టే విధించింది. నాటి నుండి ఈ కేసు విచారణ జరిగింది. అయితే ఈరోజు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు హైకోర్టులో ఊరట లభించింది. పొన్నాల ఎన్నిక చెల్లదంటూ ప్రత్యర్థి, టీఆర్ఎస్ నేత కొమ్మూరి ప్రతాప్ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

 

అయితే 2009 ఎన్నికల్లో జనగాం శాసనసభ స్థానం నుంచి 236 ఓట్ల మెజారిటీతో పొన్నాల లక్ష్మయ్య గెలుపొందారు. అయితే ఆయన ఎన్నిక చెల్లదంటూ పొన్నాల ప్రత్యర్థి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు ఆ పిటిషన్ ను హైకోర్టు కొట్టేవేయటంతో మంత్రి పొన్నాల వర్గీయులు సంబరాలు జరుపుకుంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more

  • Minister danam nagender fire on ashok babu

    దిగ్విజయ్ రాక- బాబు నోరుమూసుకో : దానం

    Dec 12 | ఈరోజుతో శీతకాలం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రజల ద్రుష్టి మొత్తం అసెంబ్లీ మీదే ఉంది. ఈరోజు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్‌తో పాటు కార్యదర్శులు తిరునావుక్కరసు, కుంతియాలు నగరానికి... Read more