Xiaomi Redmi 10 launch soon: Specs, features అద్బుత ఫీచ‌ర్ల‌తో రెడ్‌మీ 10 ఫోన్ రిలీజ్‌.. ధ‌ర‌, ఫీచ‌ర్లు ఇవే.!

Redmi 10 with 50 megapixel primary camera 90hz refresh rate display launched

Redmi 10, Redmi 10 specs, Redmi 10 features, Redmi 10 launch, Redmi 10 price, Redmi 10 Specifications, Xiaomi, MIUI, Android 11

Xiaomi's sub-brand, Redmi, is gearing up for the launch of Redmi 10 on its social media handles. Redmi 10 will feature a 6.5-inch FHD+ display with a 90Hz refresh rate. It will be powered by MediaTek Helio G88 SoC and a 5000mAh battery. Additionally, Redmi 10 will get 50-megapixel quad rear cameras and dual speakers.

అద్బుత ఫీచ‌ర్ల‌తో రెడ్‌మీ 10 ఫోన్ రిలీజ్‌.. ధ‌ర‌, ఫీచ‌ర్లు ఇవే.!

Posted: 08/19/2021 05:53 PM IST
Redmi 10 with 50 megapixel primary camera 90hz refresh rate display launched

జియోమీ.. తాజాగా రెడ్‌మీ సిరీస్‌లో 10 మోడ‌ల్ ఫోన్‌ను రిలీజ్ చేసింది. భార‌త మార్కెట్‌లో రిలీజ్ అయిన రెడ్‌మీ 10 మోడ‌ల్ ఫోన్ ఫీచ‌ర్లు మాత్రం సూప‌ర్బ్‌గా, టెంప్టింగ్‌గా ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ క్వాడ్ రేర్ కెమెరాతో ఈ ఫోన్ విడుద‌లైంది. సాధార‌ణంగా.. బ‌డ్జెట్ ఫోన్ల‌లో 32 మెగాపిక్సెల్ రేర్ కెమెరానే అందిస్తారు. కానీ.. రెడ్‌మీ 10 ఫోన్‌లో మాత్రం 50 మెగాపిక్సెల్ కెమెరాను అందిస్తున్నారు. దానితో పాటు మీడియాటెక్ ప్రాసెస‌ర్‌ను అందిస్తున్నారు.

మూడు వేరియంట్ల‌లో ఈ ఫోన్ ల‌భించ‌నుంది. బేస్ మోడ‌ల్ 4జీబీ ర్యామ్ ప్ల‌స్ 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ మోడ‌ల్ ఫోన్ ధ‌ర సుమారుగా 13,300 రూపాయ‌లు ఉండ‌నుంది. అలాగే.. 4జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ ఉన్న మోడ‌ల్ ఫోన్ ధ‌ర సుమారుగా రూ.14,800 ఉండ‌నుంది. 6జీబీ ర్యామ్ ప్ల‌స్ 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఫోన్ ధ‌ర సుమారు రూ.16,283 గా ఉండ‌నుంది. అలాగే.. వైట్‌, కార్బ‌న్ గ్రే, సీ బ్లూ క‌ల‌ర్ల‌లో ఈ ఫోన్ ల‌భించ‌నుంది.

బ‌డ్జెట్ ధ‌ర‌లో బెస్ట్ ఫీచ‌ర్ల‌తో ఫోన్ కావాల‌నుకుంటే.. ఈ ఫోన్ సూప‌ర్బ్ చాయిస్‌గా చెప్పుకోవ‌చ్చు. అయితే.. ఈ ఫోన్ ను మార్కెట్లో విడుదల చేసినప్పటికీ.. ఇంకా అన్ లైన్, ఆఫ్ లైన్ (రీటైల్ దుకాణాలలో) ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. మార్కెట్లోకి అద్భుత ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్ కు డిమాండ్ అధికంగా ఉండటంతో.. లాంచింగ్ తోనే రికార్డు సృష్టించాలని కూడా సంస్థవర్గాలు ప్రయత్నాల్లో వున్నాయని ట్రేడ్ అనలిస్టుల భావిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ ఫోన్లు మార్కెట్లో అందుబాటులోకి రానుంది.

ఫోన్ స్పెసిఫికేషన్లు ఇలా:

6.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ అడాప్టివ్ సింక్ డిస్‌ప్లే
90 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్‌,
మీడియాటెక్ హెలియో జీ88 ఎస్‌వోసీ ఫ్రోసెసర్
కెమెరా: 50 మెగాఫిక్సల్ తో పాటు  8 + 2 మెగాపిక్సల్ లతో కలపి మొత్తంగా మూడు
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ
18 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్
64, 128 జీబి స్టోరేజ్
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్
1080*2400 పిక్సల్ రిసోల్యూషన్
3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ సహా రెండు స్పీకర్లు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles