Realme C25Y With 50MP Main Camera Launched in India బ‌డ్జెట్ ధ‌ర‌లో రియ‌ల్ మీ సీ25వై ఫోన్.. 50 ఎంపీ కెమెరాతో..

Realme launches cheapest c25y with 50mp camera phone price specs and other details

realme c25y price india, realme c25y price rs 10999, realme c25y launch sale, realme c25y sales september 27, realme c25y specifications, realme c25y features, realme c25y price in india, realme c25y specifications, realme c25y, realme, gadgets, Realme C25Y, smart phone, Flipkart, Ecommerce sales, Realme website, tech news

Realme C25Y was launched in India on Thursday as an affordable offering from the company. The new Realme phone is the first model in the C series to carry a 50-megapixel primary camera. Realme C25Y comes as an upgrade to Realme C25 and includes a waterdrop-style notch. The smartphone also comes with an octa-core Unisoc SoC.

రియ‌ల్ మీ సీ25వై ఫోన్: బ‌డ్జెట్ ధ‌ర‌లో.. 50 ఎంపీ కెమెరాతో..

Posted: 09/17/2021 09:48 PM IST
Realme launches cheapest c25y with 50mp camera phone price specs and other details

పండుగ సీజన్ వచ్చిందంటే చాలు అన్ని వ్యాపార సంస్థల మధ్య పోటీ వాతావరణం అలుముకుంటోంది. అయితే ఈ పోటీ నిత్యావసర సరుకుల నుంచి మొదలుకుని విమాన ప్రయాణాల వరకు కోనసాగుతోంది. అయితే అత్యంతగా యువతను అత్యంతగా ఆకర్షించేది మాత్రం ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు స్మార్ ఫోన్లు అన్న విషయం తెలిసిందే. ఈ రంగంలోనూ ప్రస్తుతం రియల్ మీ.. రెడ్ మీ స్మార్ట్ ఫోన్ల మధ్య పోటీ జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన రెడ్ మీ 10 ప్రైమ్ ఫోన్ కు పోటీగా రియ‌ల్ మీ సీ25వై స్మార్ట్ ఫోన్ స్మార్ట్ పోన్ ప్రియులను డోలాయమానంలోకి నెడుతోంది.

ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియ‌ల్ మీ తాజాగా సీ25వై మోడ‌ల్ స్మార్ట్ ఫోన్‌ ను భార‌తీయ విపణిలో అవిష్కరించింది. అత్యంత అధునిక ఫీచర్లతో బడ్జెట్ ధరలో మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. స్టైలిష్ లుక్ తో పాటు అత్యాధునిక ఫీచర్లతో రావడంతో ఇది స్మార్ట్ ఫోన్ ప్రియులను అత్యంతగా అకర్షిస్తోంది. రియల్ మీ సీ సిరీస్ లో 50 ఎంపీ కెమెరాతో ఫోన్ విడుద‌ల కావ‌డం ఇదే తొలిసారి. ఇప్ప‌టికే రిలీజ్ అయిన‌ రియ‌ల్ మీ సీ25 ఫోన్ కు ఇది అప్‌గ్రేడ్ వ‌ర్ష‌న్. ఇందులో కూడా వాట‌ర్ డ్రాప్ స్టైల్ నాట్చ్ ఉంటుంది.  

అయితే వీటి విక్రయాలు మాత్రం ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌, రియ‌ల్‌మీ వెబ్‌సైట్‌, రిటెయిల్ ఔట్‌లెట్స్ ద్వారా అమ్మాకాలను ప్రారంభం కానున్నాయి. సీ25వై సిరీస్‌లో రెండు వేరియంట్ల ఫోన్లను రియల్ మీ విడుద‌ల చేసింది. 4 జీబీ ప్ల‌స్ 64 జీబీ వేరియంట్ ఫోన్ ధ‌ర‌ను రూ.10,999గా నిర్ణ‌యించ‌గా.. 4 జీబీ ప్ల‌స్ 128 జీబీ వేరియంట్ ధ‌ర‌ను రూ.11,999గా నిర్ణ‌యించింది. రెండు మోడ‌ల్స్ బ్లూ, గ్రే క‌ల‌ర్ల‌లో ల‌భించ‌నున్నాయి. సెప్టెంబ‌ర్ 20 నుంచి ఈ ఫోన్ల ప్రీఆర్డ‌ర్స్ ప్రారంభం అవుతాయి.

స్పెసిఫికేషన్స్:

ఆండ్రాయిడ్ 11,
6.5 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే
ఆక్టాకోర్ యూనిస‌క్ టీ610 ఎస్‌వోసీ ప్రాసెస‌ర్‌
ట్రిపుల్ కెమెరా సెట‌ప్‌
50 ఎంపీ రేర్ కెమెరా
8 ఎంపీ ఫ్రంట్ కెమెరా
4జీ ఎల్‌టీఈ, వైఫై 802
బ్లూటూత్ వీ5
మైక్రో యూఎస్‌బీ
3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్‌
5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gadgets  Realme C25Y  smart phone  Flipkart  Ecommerce sales  Realme website  tech news  

Other Articles

Today on Telugu Wishesh