Samsung Galaxy J2 (2016) Launched in India at a Price of Rs. 9750

Samsung launches new galaxy j2 galaxy j max in india

Samsung Galaxy J2 2015,Release Date,Galaxy J2 price,specifications,How will it stack up against Galaxy J2 2015,specifications comparison

Samsung on Friday unveiled its new Galaxy J2 (2016) smartphone alongside the Galaxy J Max tablet in India.

భారతీయ విఫణీలోకి శామ్ సంగ్ నుంచి మరో కొత్త స్మార్ట్ పోన్, ట్యాబ్

Posted: 07/08/2016 06:48 PM IST
Samsung launches new galaxy j2 galaxy j max in india

చైనా కంపెనీల నుంచి ఎదురవుతున్న పోటీ తట్టుకునేందుకు దక్షిణ కొరియా మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ శాంసంగ్ మరో కొత్త స్మార్ట్ ఫోన్ ఆవిష్కరించింది. గెలాక్సీ జే2 స్మార్ట్ ఫోన్ తో పాటు గెలాక్సీ జే మ్యాక్స్ టాబ్లెట్ ను భారత మార్కెట్ లోకి విడుదల చేసింది. గెలాక్సీ జే2 ధర రూ. 9,750గా నిర్ణయించింది. నలుపు, బంగారం, వెండి రంగుల్లో లభ్యమయ్యే ఈ ఫోన్ జూలై 10 నుంచి ఆన్లైన్, శాంసంగ్ షోరూముల్లో కొనుక్కోవచచ్చు. ప్రమోషన్లో భాగంగా కొనుగోలుదారులకు శాంసంగ్ బంఫర్ ఆఫర్ ప్రకటించింది.

ఎయిర్ టెల్ ప్రిపేయిడ్ వినియోగదారులకు రూ.4500 విలువ చేసే డబుల్ డేటాను 6 నెలలపాటు ఉచితంగా అందించనుంది. నెక్ట్స్ జనరేషన్ ఎల్ఈడీ సిస్టమ్ ఉండడం గెలాక్సీ జే2 స్మార్ట్ఫోన్ లో హైలెట్. దీంతో కాంటాక్ట్, యాప్ లేదా ఫోన్ వాడినప్పుడు కలర్ కోడ్ వస్తుంది. క్విక్ పానల్ ద్వారా దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ప్రయారిటీ ఆలర్ట్స్, యూసేస్ ఆలర్ట్స్, సెల్ఫీ అసిస్ట్ కోసం నెక్ట్స్ జనరేషన్ ఎల్ఈడీ సిస్టమ్ వాడుకోవచ్చు. స్మార్ట్ఫోన్ పనితీరు మెరుగుపరిచేందుకు ఇందులో కొత్తగా టర్బొ స్పీడ్ టెక్నాలజీ ప్రవేశపెట్టింది.

స్మార్ట్‌ఫోన్‌లో గెలాక్సీ జే 2 ఫీచర్స్
* 5.00 అంగుళాల స్ర్కీన్
* 1.5 జీహెచ్ జీ ప్రాసెసర్
* 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా
* 8 ఎంపీ రియర్ కెమెరా
* 1.5 జీబీ ర్యామ్
* ఆండ్రాయిడ్ 6.0 ఓఎస్
* 8 జీబీ మెమరీ (32 జీబీ ఎక్స్పాండబుల్ మెమరీ)
* 4జీ
* 2600 ఎంఏహెచ్ బ్యాటరీ
* ఎస్ బైక్ మోడ్ వంటి ప్రత్యేకతలు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Samsung Galaxy J2  smartphone  Galaxy J Max tablet  sales  Indian market  

Other Articles