Datsun sells nearly 3000 units of Redigo within a month

Nissan sells 3000 units of datsun redi go since launch

Nissan, Redi-Go, Datsun, sales, Indian market, datsun news, datsun price, datsun review, No. 1 in India, Indian market

Japanese automaker Nissan Motor today said it has sold 3,000 units of Datsun redi-GO cars, since the launch last month..

చిన్నకార్ల రేసులో ముందుకు దూసుకెళ్తున్న రెడి గో

Posted: 07/06/2016 07:04 PM IST
Nissan sells 3000 units of datsun redi go since launch

జపాన్‌కు చెందిన కార్ల తయారీ దిగ్గజ సంస్థ నిస్సాన్ నుంచి వెలువడిన డాట్సన్ బ్రాండ్‌లో ప్రవేశపెట్టిన చిన్న కారు 'రెడి-గో' అమ్మకాల్లో దూసుకుపోతోంది. మారుతీ ఆల్టో, హ్యుందాయ్ ఈఆన్, రెనో క్విడ్ కార్లకు పోటీగా విక్రయాలు సాగిస్తూ.. వాటికి భారీ పోటీని ఇస్తుంది. అందమైన, అకర్షనీయమైన వర్ణాలతో పాటు డిజైనింగ్ తో చిన్నకారు కాదు అన్నట్లుగా రెడీ గో అమ్మాకాలను సాగిస్తుంది. దేశంలోని మధ్యతరగతి ప్రజలను తమ వైపు అకర్షించేలా చేస్తుంది. 23 రోజుల్లోనే 3 వేల కార్లు అమ్ముడయ్యాయి.

జూన్ 7 నుంచి ప్రారంభమైన 'రెడి-గో' అమ్మకాలకు దేశవ్యాప్తంగా అనూహ్య స్పందన వస్తోందని నిస్సాన్ ఇండియా ఎండీ, అరుణ్ మల్హోత్ర తెలిపారు. 23 రోజుల్లో 3 వేల కార్లు అమ్ముడయ్యాయని వెల్లడించారు. వినియోగదారులకు పెద్ద సంఖ్యలో కార్లు డెలివరీ చేయాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. 274 సేల్స్ అండ్ సర్వీసెస్ అవుట్లెట్స్ ద్వారా 'రెడి-గో' అమ్మకాలు సాగిస్తున్నామన్నారు. 'రెడి-గో' పెట్రోల్ కారు ధరలు 2.38 లక్షల నుంచి రూ.3.34 లక్షల రేంజ్‌లో నిర్ణయించారు.

డాట్సన్ ఈ కారును ఐదు వేరియంట్లు-డి, ఏ, టీ, టి(ఓ), ఎస్‌ల్లో అందిస్తున్నారు. డాట్సన్ బ్రాండ్ కింద కంపెనీ అందిస్తోన్న మూడో కారు ఇది. భారత్‌లో అభివృద్ధి చేసిన కొత్త ప్లాట్‌ఫాం మీద ఈ కారును నిస్సాన్‌కంపెనీ తయారు చేస్తోంది. 800 సీసీ ఇంజిన్, ఐదు గేర్లు ఉన్న ఈ కారు 25.17 కి.మీ. మైలేజీని ఇస్తుందని,  వంద కిమీ, వేగాన్ని 15.9 సెకన్లలోనే అందుకుంటుందని, గరిష్ట వేగం గంటకు 140 కి.మీ. అని నిస్సాన్ కంపెనీ తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nissan  Redi-Go  Datsun  sales  Indian market  

Other Articles