Gold could lose more sheen as markets fear further US Fed rate hike

Will 2016 be good as gold

gold, gold market, us fed, us fed hike, indian stocks, stock market, stock market today, investors, investors 2015, stock market 2015, gold, gold investors

Gold prices fell sharply this year to lows not seen since 2010. The current low in prices marks a fall of 11% this year and 46% from its peak in 2011.

పసిడి పయనం ఎటో తేలేది కొత్త సంవత్సరంలోనట..!

Posted: 12/29/2015 06:42 PM IST
Will 2016 be good as gold

ప్రపంచ వ్యాప్తంగా అటు మార్కెట్లతో పాటు ఇటు బంగారు, వెండి అభరణాల ధరల హెచ్చతగ్గులపై అమెరికా ఫెడరల్ రిజర్వు ఫండ్ రేటు తీవ్ర ప్రభావాన్ని చూపింది. అమెరికా ఫెడ్ రిజర్వు.. ద్రవ్య పరపతి సమీక్షించి ఫండ్ రేటు పావు శాతం నుంచి 0.50 శాతానికి పెంచిన వెంటనే అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో పసిడి ఆరేళ్ల కనిష్ట స్థాయి ఔన్స్ (31.1గ్రా) 1,050 డాలర్లకు పడిపోయింది.  అయితే అప్పటి నుంచీ పసిడి ధర క్రమంగా పెరుగుతూ తిరిగి దాదాపు 1,080 డాలర్లకు ఎగసింది.  ఇకముందు పరిస్థితి ఏమిటన్నది ప్రస్తుతం నిపుణుల ముందు పెద్ద ప్రశ్నగా ఉంది. మెజారిటీ అభిప్రాయం చూస్తే... రానున్న 15 రోజుల కాలంలో ధర దాదాపు ప్రస్తుత స్థాయిలోనే కొనసాగుతుంది.

ఈ విలువైన మెటల్ పయనం వెనక్కా... లేదా ముందుకా అన్నది తేలేది వచ్చే ఏడాదేనని ఈ రంగంలో నిపుణుడు, ఆర్‌జేఓ ఫ్యూచర్స్‌లో నిపుణుడు బోబ్ బాబర్‌కోర్న్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మందగిస్తే... పసిడి ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనంగా మారుతుందని ఆయన అంచనా.  అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగిస్తే.. డాలర్ విలువ పడిపోయే అవకాశం ఉందని, ఇదే జరిగితే మూడేళ్లుగా నత్తనడక నడుస్తున్న పసిడి పరుగు ప్రారంభమయ్యే వీలుందని క్రెడిట్ సూచీ అభిప్రాయపడింది. ఆయా పరిస్థితుల్లో పసిడి 1,100 డాలర్ల నుంచి 1,150 డాలర్ల మధ్య శ్రేణిలో కదలాడే వీలుందని అభిప్రాయపడింది.
 
కాగా, దేశీయంగా చూస్తే...పసిడి ధరలు పైపైకే ఎగబాకుతున్నాయి. వారం వారీగా పసిడి 99.5 ప్యూరిటీ  10 గ్రాముల ధర రూ.260 ఎగసి రూ.25,195 వద్ద ముగిసింది. 99.9 ప్యూరిటీ ధర కూడా ఇంతే మొత్తం ఎగసి 25,345 వద్ద ముగిసింది. ఇక వెండి ధర కేజీకి భారీగా రూ.940 ఎగసి రూ.34,460కి చేరింది. దిగువ స్థాయి ధరల వద్ద స్టాకిస్టులు, వర్తకుల నుంచి కొనుగోళ్ల డిమాండ్ రావడంతో ధరలు పెకి ఎగడాకుతున్నాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : gold  gold market  us fed  us fed hike  

Other Articles