Sensex, Nifty end flat in a lacklustre trade; Dr Lal, Alkem extend gains

Nifty ends above 7850 sensex flat icici maruti sbi drag

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, Federal Reserve, fiscal consolidation, GDP growth, Today sensex, today nifty, Infosys, Indian rupee, currency, dollar, BHEL, Titan, Tata Motors, Punjab National Bank, ICICI bank, Hindustan Unilever, Hero MotoCorp, International prices, American central bank interest rates, Gold price

Vedanta, Bharti, Hindalco, GAIL and Tata Motors were top gainers in the Sensex. ICICI Bank, Maruti, SBI, ONGC and HDFC were top losers in the Sensex.

తటస్థంగా స్టాక్ మార్కెట్లు.. స్వల్ప నష్టాలలో ముగింపు

Posted: 12/24/2015 06:33 PM IST
Nifty ends above 7850 sensex flat icici maruti sbi drag

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభనష్టాల మధ్య ఊగిసలాడుతూ.. ఎట్టకేలకు స్వల్ప నష్టాల మధ్యే ముగిశాయి. ఉదయం సుమారుగా 72 పాయింట్ల మేర లాభాలను ఆర్జించిన మార్కెట్లు పలు పర్యాయాలు లాభనష్టాల మధ్య ఒడిదోడుకులను ఎదుర్కోంది. ఒక రోజు లాభాలు, మరో రోజు నష్టాలతో ఒడిదోడుకులకు గురవుతున్న మార్కెట్లు ఇవాళ స్వల్ప నష్టాలల్లో పయనించాయి. క్రిస్టమస్ పండగ పర్వదినం నేపథ్యంలో మార్కెట్లు ఆధ్యంతం తటస్థంగానే కొనసాగాయి. దీనికి తోడు వీదేశీ మదుపరులు కూడా పండగ సంబరాల్లో మునిగిపోవడంతో..మార్కెట్లు ఇవాళ తటస్థంగానే ముగిశాయి

ఇవాళ ఉదయం మార్కెట్లు ప్రారంభమైన సమయం నుంచే దేశీయ సూచీలు లాభాలు ఆర్జించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 72 పాయింట్లు లాభపడి 25,922 మార్క్ ను అందుకోగా, ఎన్ఎస్ఈ సూచి నిఫ్టీ 23 పాయింట్లు పెరిగి 7,888కు చేరింది. అయితే కొద్ది మేరకు వచ్చిన లాభాలను మార్కెట్లు అదిమి పట్టుకోవడంలో విఫలం కావడంతో చివరకు సెన్సెక్స్ 12 పాయింట్ల మేర నష్టాలను చవిచూడగా, నిఫ్టీ కూడా 7800 మార్కుకు చేరువలో ట్రేడింగ్ ను ముగించింది. దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెస్సెక్స్ 12 పాయింట్ల నష్టంలో 25, 839 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగియగా, అటు నిఫ్టీ కూడా 5 పాయింట్ల నష్టంతో 7861 పాయంట్ల వద్ద ముగిసింది.

ఇవాళ జరిగిన ట్రేడింగ్ లో ఒక్క కన్యూమర్ డ్యూరబుల్స్ సెక్టార్ భారీ నష్టాలను చవిచూడగా, బ్యాకింగ్, బ్యాంకింగ్ నిఫ్టీ, ఐటీ సూచీలు నష్టాలను ఎదుర్కోన్నాయి. కాగా మినహా అన్ని సూచీలు లాభాలలో దూసుకెళ్లాయి. హెల్త్ కేర్, క్యాపిటల్ గూడ్స్, మెటల్స్, అయిల్ అండ్ గ్యాస్ సూచీలు భారీ లాభాలను ఆర్జించాయి, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, టెక్నాలజీ, చిన్న మధ్య తరహా పరిశ్రమల సూచీలు, ఎఫ్ ఎం జీ సీ, అటో రంగ సూచీలు కూడా స్వల్ప లాభాలను అర్జించాయి. ఈ క్రమంలో వేదంతా, కాయిర్న్ ఇండియా, భారతి ఎయిర్ టెల్, హిండాల్కో, ఐడియా సెల్యూలార్, సంస్థల షేర్లు భారీ లాభాలను అర్జించగా, జీ ఎంటర్ టైన్మెంట్, ఐసిఐసిఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, మారుతి సుజుకీ. హెఛ్ డీ ఎఫ్ సీ సంస్థల షేర్లు నష్టాలను చవిచూశాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  Gold and silver  indian rupee  RBI  

Other Articles