RBI says CRR, SLR applicable to short-term gold deposits

Rbi issues norms for gold monetisation scheme

RBI Norms for Gold Monetisation, CRR, SLR, short-term gold deposits, Central government, Gold monetization scheme, Reserve Bank of India, Prime Minister Narendra Modi, Gold scheme, Gold jewellery

The Reserve Bank of India (RBI) has issued norms for implementation of the gold monetisation scheme.

పసిడి డిపాజిల్ స్కీమ్ మార్గదర్శకాలు జారీ చేసిన ఆర్బీఐ

Posted: 10/24/2015 03:33 PM IST
Rbi issues norms for gold monetisation scheme

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్(బంగారం డిపాజిట్ పథకం) మార్గదర్శకాలను భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) జారీ చేసింది. గోల్డ్ డిపాజిట్లకు వడ్డీరేట్లను నిర్ణయించే పూర్తి స్వేచ్ఛ బ్యాంకులకే ఇస్తున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది. వచ్చే నెల 5న అధికారికంగా ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ఆర్‌బీఐ నిబంధనల నోటిఫికేషన్ వెలువడింది. దేశంలోని ప్రజలు, వివిధ సంస్థల వద్దనున్న దాదాపు 20 వేల టన్నుల మేర ఉత్పాదకతకు నోచుకోని బంగారాన్ని తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకొచ్చే ఉద్దేశంతో కేంద్రం ఈ పథకానికి రూపకల్పన చేసింది. సెప్టెంబర్‌లో కేంద్ర కేబినెట్ దీనికి ఆమోదముద్ర వేసింది. కాగా, నిరుపయోగంగా పడి ఉన్న బంగారం విలువ దాదాపు రూ.5.4 లక్షల కోట్లుగా అంచనా వేస్తుంది కేంద్రం
 
మార్గదర్శకాల్లో ముఖ్యాంశాలివీ...

* బంగారం డిపాజిట్ పరిమాణానికి సంబంధించి గరిష్ట పరిమితేమీ లేదు. అయితే, కనీస డిపాజిట్ 30 గ్రాములుగా వుండాలి
* డిపాజిట్ చేసిన రోజు నుంచి 30 రోజుల తర్వాత నుంచి వడ్డీ లెక్కింపు మొదలవుతుంది.
* గోల్డ్ డిపాజిట్‌కు సంబంధించి అసలు, వడ్డీ మొత్తాన్ని బంగారం రూపంలోనే లెక్కిస్తారు.
* మెచ్యూరిటీ సమయంలో అసలు, వడ్డీని మార్కెట్ రేటు ప్రకారం నగదు లేదా బంగారం రూపంలో బ్యాంకులు చెల్లించవచ్చు.
* పసిడిని డిపాజిట్ చేసే సమయంలోనే ఈ రెండు ఆప్షన్లలో ఒకదాన్ని డిపాజిటర్ ఎంచుకోవాలి.
* గోల్డ్ డిపాజిట్లకు స్వల్పకాలిక (1-3 ఏళ్లు), మధ్యకాలిక (5-7 ఏళ్లు), దీర్ఘకాలిక (12-15 సంవత్సరాలు) స్కీమ్‌లు వున్నాయి
* గోల్డ్ డిపాజిట్ స్కీమ్ స్కీమ్ ల కన్నా ముందే వైదొలిగితే.. డిపాజిటర్లు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
* స్వల్పకాలిక బ్యాంక్ డిపాజిట్‌లను బ్యాంకులే నేరుగా తమ సొంత ఖాతాల్లోనే అనుమతిస్తాయి.
* మధ్య, దీర్ఘకాలిక ప్రభుత్వ డిపాజిట్ స్కీమ్‌ను మాత్రం భారత ప్రభుత్వం తరఫున అమలు చేయాల్సి ఉంటుంది.
* బ్యాంకులకు ఆర్‌బీఐ నిర్దేశించే సీఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ పరిధిలోకే ఎస్‌టీబీడీలు వస్తాయి.
* ప్రస్తుతం సీఆర్‌ఆర్ 4 శాతంగా, ఎస్‌ఎల్‌ఆర్ 21.5 శాతంగా ఉన్నాయి.
* ఈ స్కీమ్‌లో సమీకరించిన పసిడిని బ్యాంకులు విక్రయించుకునే, రుణంగా ఇచ్చుకునే అవకాశం
* మధ్య, దీర్ఘకాలిక స్కీమ్‌ల కింద సమీకరించే బంగారాన్ని కేంద్ర ప్రభుత్వం వేలంలో విక్రయిస్తుంది.
* తద్వారా లభించే నిధులను ఆర్‌బీఐ వద్ద ఉండే కేంద్ర ప్రభుత్వ ఖాతాలో జమచేస్తారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles