Profit booking drives Sensex, Nifty down; HDFC, Bharti sink

Sensex falls 108 points on profit taking nifty holds 8250

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, Federal Reserve, fiscal consolidation, GDP growth, Today sensex, today nifty, Infosys, Indian rupee, currency, dollar, BHEL, Titan, Tata Motors, Punjab National Bank, ICICI bank, Hindustan Unilever, Hero MotoCorp, International prices, American central bank interest rates, Gold price

HDFC was down 2 percent after the housing finance company's net interest income missed analysts' expectations but profit beat estimates that increased 18 percent.

వారారంభంలోనే దేశీయ సూచీలకు నష్టాలు.. విదేశీ మదుపరుల ఎఫెక్ట్

Posted: 10/26/2015 07:07 PM IST
Sensex falls 108 points on profit taking nifty holds 8250

విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల పవనాలతో ఇవాళ స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ కారణంగా నష్టాల్లోకి జారాయి. ఒక దశలో దేశవాళీ ఇన్వెస్టర్లు సైతం ఈక్విటీలను విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నట్టు కనిపించినా, ఆసియా మార్కెట్ల సరళి కొనుగోలు సెంటిమెంటు నిలపడంతో, ఈక్విటీల విక్రయాలు ఆగిపోయాయి. ఉదయం మార్కెట్లు ప్రారంభంతోనే 100 పాయింట్ల మేర లాభాలను ఆర్జించిన మార్కెట్లు.. తరువాత తీవ్ర ఒడిదోడుకులకు గురై చివరకు నష్టాలతో ముగిశాయి  దీంతో మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 109 పాయింట్లు నష్టాన్ని మూటగట్టుకుని 27 వేల 362 పాయింట్ల వద్ద ముగియగా, అటు నిఫ్టీ కూడా 35 పాయింట్లు నష్టంతో 8,260 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించింది.

ఇవాళ మొత్తం 2,869 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 978 కంపెనీలు లాభాలను, 1,735 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి. ఈ క్రమంలో బిఎస్సీ బ్యాంకింగ్, బ్యాంకింగ్ నిష్టీ సహా కన్జూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంజీసీ, హెల్త్ కేర్, మెటల్స్, అయిల్ అండ్ గ్యాస్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, టెక్నాలజీ, మద్య తరహా, చిన్న తరహా పరిశ్రమల సూచీలు నష్టాలలో పయినియంచగా, మిగిలిన అటో, క్యాపిటల్ గూడ్స్, ఐటీ సంస్థల సూచీలు లాభాలను అర్జించాయి. ఈ నేపథ్యంలో బిహెచ్ఈఎల్, వేదంతా, బజాజ్ అటో, టాటా స్టీల్, హెచ్ సీ ఎల్ టెక్ తదితర సంస్థలు లాభాలను ఆర్జించగా, ఏషియన్ పెయింట్స్, యస్ బ్యాంక్, కోల్ ఇండియా, అల్ట్రా టెక్ సిమెంట్, భారతీ ఎయిర్ టెల్ తదితర సంస్థల షేర్లు అధిక నష్టాలను చవిచూశాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  Gold and silver  indian rupee  RBI  

Other Articles