భారత స్టాక్ మార్కెట్లకు మండే చాలా మంచి చేసింది. రికార్డు స్థాయిలో సెన్సెక్స్ రికార్డు కావడం మదుపర్లను సంతోషపెట్టింది. నిఫ్టీ 168 పాయింట్లు పుంజుకొని 8100 పాయింట్ల దగ్గరి నుండి 8119 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే సెన్సెక్స్ కూడా 565 పాయింట్లు పెరిగి ఇన్వెస్టర్లకు సంతోషాన్ని తీసుకువచ్చింది. డాలర్ విలువ రూపాయి మారకంలో 65.21కి చేరింది. యుఎస్ ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లను వచ్చే ఏడాది వరకు పెంచదు అన్న అంచనాలు, అలాగే ఎకనామిక్స్ ఎఫైర్స్ సెక్రటరీ వెల్లడించిన కరెంట్ ఎకనామిక్ గ్రోత్ రేట్ 7.5 చేరిందని ప్రకటించడం కూడా మార్కెట్ల మీద ప్రభావాన్ని చూపాయి. అలాగే బ్యాంకింగ్ షేర్ల ర్యాలీ కొనసాగడం, ఫార్మా రంగంలోకూడా అమ్మకాలు జోరందుకోవడం నిలకడగా మార్కెట్ సాగిన తీరు ఇన్వెస్టర్లకు లాభాలు గడించిపెట్టాయి. టాప్ గెయినర్స్ లో జిందాల్ స్టీల్స్, టాటా స్టీల్, జిజిపిఎల్ లు ఉండగా.. మారుతి, డాబర్, లుప్టిన్ లు లాస్ లొ కొనసాగాయి. మొత్తంగా మార్కెట్ లో కొన్ని కంపెనీలు మాత్రం కాస్త నిరాశ చెందినా దాదాపు అందరికి అనుకూలంగానే మార్కెట్ ర్యాలీ సాగిందని చెప్పవచ్చు.
టాప్ గెయినర్స్...
JINDALSTEL 15.21%
GODREJCP 6.78%
GPPL 6.33%
TATASTEEL 6.01%
టాప్ లూసర్స్...
MARUTI -3.63%
AMTEKAUTO -1.65%
DABUR -1.29%
LUPIN -1.24%
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more