Nifty ends near 8200; IT slips 2%, Hindalco surges 9%

Sensex jumps 103 points up on global cues strong rupee nift

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, Federal Reserve, fiscal consolidation, GDP growth, Today sensex, today nifty, Infosys, Indian rupee, currency, dollar, BHEL, Titan, Tata Motors, Punjab National Bank, ICICI bank, Hindustan Unilever, Hero MotoCorp, International prices, American central bank interest rates, Gold price

Domestic equity markets opened flat on Wednesday tracking SGX Nifty and Asian markets. Sensex opened 0.13 per cent up at 26,966.86. Nifty opened 6.7 points down at 8,146.20.

6వ రోజు లాభాల్లో స్టాక్ మార్కెట్లు..8200 పాయింట్ల వద్ద నిఫ్టీ

Posted: 10/07/2015 07:12 PM IST
Sensex jumps 103 points up on global cues strong rupee nift

విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలకు తోడు రూపాయి ట్రేడింగ్ కూడా బలంగా జరగడంతో.. భారతీయ స్టాక్ మార్కెట్లు వరుసగా అరవ రోజు లాభాలను గడించాయి. ఇవాళ ప్లాట్ గా ట్రేడింగ్ ను ఆరంభించిన స్టాక్ మార్కెట్లు ఒడిదోడుకులను ఎదుర్కోన్నా చివరకు 103 పాయింట్ల లాభంతో ముగిసింది. లాభాలతో ప్రారంభమైన ప్రధాన సూచీలు తర్వాత నష్టాల్లో ట్రేడ్‌ అయి.... మధ్యాహ్నానికి కాస్త కోలుకుని లాభాల్లో ట్రేడ్‌ అయ్యాయి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 29 పాయింట్లు లాభపడి 26,994 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అయింది. నిఫ్టీ 15 పాయింట్లు లాభపడి 8,162 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అయింది.

ఇక అక్కడి నుంచి లాభాలను అధిమి పట్టుకున్న స్టాక్ మార్కెట్లు అదే క్రమంలో ముగిసాయి. నిఫ్టీ కూడా లాభాలను అదిమిపట్టుకుంది. ఇవాళ ముగింపు సమయానికి 8200 మార్కు చెంతలో నిలిచింది సెన్సెక్స్ 103 పాయింట్లు లాభపడి 27 వేల 36 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 25 పాయింట్లు లాభపడి 8177 పాయింట్ల వద్ద ముగసింది. ఈ క్రమంలో ఐటీ, టెక్నాలజీ మినహా అన్ని రంగాల సూచీలు లాభాలలో పయనించాయి. ఆటో, మెటల్స్, అయిల్ అండ్ గ్యాస్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ సూచీలు భారీ లాభాలను ఆస్వాదించగా, బ్యాకింగ్, బ్యాకిండ్ నిఫ్టీ, హెల్త్ కేర్, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమల సూచీల స్వల్ప లాభాలను ఆర్జించాయి ఈ నేపథ్యంలో హిండాల్కో, వేదంతా, కాయిర్న్ ఇండియా, ఓఎన్జీసీ, టాటా స్టీల్ తదితర సంస్థలు లాభాలను ఆర్జించగా, హెచ్ సి ఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్, ఇన్పోపిస్, భారతీ ఎయిటెల్, విప్రో సహా తదితర సంస్థల షేర్లు అధిక నష్టాలను చవిచూశాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  Gold and silver  indian rupee  RBI  

Other Articles