Gold | Price | Fall | India | US

V

gold prices, 10 grams, US Federal Reserve, domestic rating agency, Fed hikes interest rates, Gold prices in India, prediction comes true

Gold prices may crash to twenty thu\ousand five hundred.Gold price may fall to twenty thousand to thenty four thousand in this season. The stock markets marks gold prices fall.

బంగారం ధర 20,500కు పడిపోతుందట

Posted: 06/11/2015 05:19 PM IST
V

గత కొంత కాలంగా మారుతున్న మార్కెట్ అంచనాలకు చిక్కడం లేదు. గతంలో 33,000దాకా ఉన్న బంగారం విలువ ఇప్పుడు 27 వేల పైచిలుకు పలుకుతోంది. అయితే తాజాగా బంగారం్ విలువ గణనీయంగా 20వేల వరకు పడిపోతోందన్న వార్త మార్కెట్ లో దుమారాన్ని రేపుతోంది. మేలిమి బంగారం పది గ్రాములు 20వేలకే వస్తే ఏం చేస్తారు? నమ్మశక్యంగా లేకపోయినా అది జరిగేలా కనిపిస్తోంది. త్వరలోనే గోల్డ్ రేట్స్ భారీగా తగ్గనున్నాయి. ఇందుకు దేశీయ పరిస్థితుల కంటే అంతర్జాతీయ అంశాలే ఎక్కువ ప్రభావం చూపించనున్నాయి. 24 క్యారెట్ల గోల్డ్ 24వేల నుంచి 20,500లకు చేరుతుందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలంటున్నాయి.

ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు, కరెన్సీ విలువ ఎలా ఉన్నా... గోల్డ్‌ రేట్లు మాత్రం దిగివచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచితే... డాలర్ విలువ పెరుగుతుంది. బంగారంపై పెట్టుబడులు ప్రభుత్వ బాండ్లవైపు మళ్లుతాయి. ఫలితంగా పసిడికి డిమాండ్ పడిపోయి, ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గుతాయి. మన దేశంలో 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు 24వేల రూపాయల నుంచి 20వేల 500 రూపాయల మధ్య తగ్గే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు 27వేల 350 రూపాయలుంది. అలాగే 22 క్యారెట్ల నగల బంగారం ధర పది గ్రాములు 25వేల 550 రూపాయలు పలుకుతోంది. 2008 నుంచి అమెరికాలో వడ్డీ రేట్లు సున్నా దగ్గరే స్థిరంగా ఉంటున్నాయి. కొన్నాళ్లుగా వడ్డీ రేట్లు పెంచాలనే డిమాండ్లు వస్తున్నాయి. వడ్డీ రేట్లు పెంచితే... ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున ప్రభుత్వ బాండ్లను కొంటారు. బంగారంపై పెట్టిన పెట్టుబడులను బాండ్లపైకి మళ్లిస్తారు. అందువల్ల బంగారానికి డిమాండ్ అమాంతంగా పడిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ రేట్లు తగ్గుతాయి. బంగారం ధరలెలా వున్నా... వెండి ధర మాత్రం కొద్దికొద్దిగా పెరుగుతోంది. పారిశ్రామిక వర్గాల నుంచి నాణేలకు డిమాండ్ వస్తుండటంతో కేజీ వెండి ప్రస్తుతం 40వేల 672 రూపాయలకు చేరింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gold prices  gold  indian  BSE  US  fedaral bank  

Other Articles