Sensex trades in green ahead of RBI policy meet

Sensex gains 244 pts ahead of rbi policy

BSE Sensex, NSE Nifty, India's stock market, Sensex, Stocks, Sensex today, BSE, NSE

After a directionless trade, the market picked up momentum in last couple of hours of trade on Monday with the Sensex rising more than 270 points ahead of RBI policy.

ఆర్బీఐ ద్రవపరమితి సమీక్ష నేపథ్యంలో లాభాల్లో స్టాక్ మార్కెట్లు

Posted: 04/06/2015 07:21 PM IST
Sensex gains 244 pts ahead of rbi policy

దేశీయ స్టాక్ మారెట్లు ఇవాళ లాభాల బాటలో పయనించాయి. భారతీయ రిజర్వు బ్యాంకు ద్రవ్య పరపతి సమావేశం కానున్న నేపథ్యంలో సూచీలు లాభాల బాటలో పయనించడంతో మార్కట్లు లాభాలను ఆర్జించాయి. ఉదయం మార్కెట్ ప్రారంభంలో 90 పాయింట్ల లాభంతో పయనించిన సెన్సెక్స్.. ఆ తరువాత క్రమంగా ఒడిదోడుకులకు లోనైంది. అటు నిష్టీ కూడా 20 పాయింట్ల లాభంతో పయనించి.. క్రమేనా లాభనష్టాల మధ్య కొట్టుమిట్టాడింది. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానంపై త్వరలో సమీక్షించనుందన్న వార్తల నేపథ్యంలో మార్కట్లు మధ్యాహ్నం తరువాత పుంజుకున్నాయి.

హెల్త్ కేర్, కాపిటల్ గూడ్స్, కన్సూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ ఎం జీ సీ గూడ్స్ సూచీలు అధిక లాభాలను ఆర్జించడంతో మార్కట్లు లాభాలను గడించాయి. ఈ సూచీల ప్రభావంతో రమారమి అన్ని సూచీలు లాభాల బాటలో పయనించాయి. బ్యాంకింగ్ రంగ సూచీతో పాటు లోహాలకు చెందిన సూచీలు మాత్రం స్వల్ప నష్టాలను చవిచూశాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ 244 పాయింట్లు లాభపడి 28 వేల 504 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 74 పాయింట్లు లాబపడి 8 వేల 6560 పాయింట్ల వద్ద ముగిసింది.. ఈ క్రమంలో సన్ ఫార్మ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, గెయిల్, కాయిర్న్ ఇండియా, సిప్లా సంస్థల షేర్లు అత్యధిక లాభాలను గడించగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, విప్రో, టాటా స్టీల్, రిలయన్ష, ఇండస్ ఇండ్ బ్యాండ్ సంస్థల షేర్లు నష్టాలను చవిచూశాయి

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BSE Sensex  NSE Nifty  India's stock market  

Other Articles