Sensex trades in green ahead of RBI policy meet

Rbi holds repo rate single rate cut seen in 2015

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, CRR, fiscal consolidation, GDP growth, R&B, Raghuram Rajan, RBI, RBI rate cut, Repo rate, RBI governer raghuram rajan, Reserve Bank of India monetary policy, RBI policy rates in April, Reporate, Reverse Repo Rate, CRR SLR MSF

Following two rate cuts already this year, the Indian central bank stood pat on rates. Experts believe there is just one more rate cut in the offing for the remaining part of the year.

ఆర్బీఐ ద్రవపరమితి సమీక్ష: కీలక వడ్డీరేట్లు యధాతథం

Posted: 04/07/2015 09:18 PM IST
Rbi holds repo rate single rate cut seen in 2015

దేశీయ స్టాక్ మారెట్లు ఇవాళ స్వల్ప లాభాలతో ముగిసాయి. భారతీయ రిజర్వు బ్యాంకు ద్రవ్య పరపతి సమావేశంలో కీలక వడ్డీ రేట్లను యదాతథంగా కోనసాగిస్తూ రిజర్వు బ్యాంకు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దేశీయ సూచీలు నష్టాల బాటలో పయనించాయి. కాగా ముగింపు సమయంలో నాటకీయ పరిణమాల మధ్య మార్కెట్లు కోలుకుని వరుసగా మూడవ రోజు లాభాలను గడించాయి. గత నెలలో కీలక వడ్డీ రేట్లను తగ్గించడంతో ఈ సారి అదే విధంగా స్వల్పంగా వడ్డీరేట్లను తగ్గిస్తారన్న మదుపుదారులు ఆశలు అడియాశలయ్యాయి.

భారతీయ రిజర్వు బ్యాంకు ద్రవ్య పరపతి సమావేశం నేపథ్యంలో ఉదయం ప్రారంభమైన మార్కెట్లు భారీ లాభాలతో దూసుకుపోయాయి. ఆ తరువాత ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానంలో వడ్డీ రేట్లలో మార్పులు లేవని ప్రకటించడంతో మార్కెట్లు డీలా పడ్డాయి. అమ్మకాలకు మదుపుదారుల మొగ్గు చూపారు. తీరా ముగింపు సమయంలో నాటకీయ పరిణామాల మధ్య పుంజుకున్న మార్కెట్లు ఎట్టకేలకు స్వల్పలాభాలతో ముగిసాయి. ఈ నేపథ్యంలో హెల్త్ కేర్, బ్యాంకింగ్ రంగ సూచీలు నష్టాలలో పయనించగా, మిగిలిన అన్ని సెక్టార్లు లాభాలతోనే ముగిసాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 12 పాయింట్ల లాభంతో 28 వేల 517 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ యధాతథంగా 8 వేల 660 పాయింట్ల వద్ద కోనసాగింది.

ఈ క్రమంలో టాటా స్టీల్, సీసా స్టరిటైట్, బజాబ్ అటో, ఎన్టీపీసీ, మహేంద్ర అండ్ మహేంద్ర సంస్థల షేర్లు అత్యధిక లాభాలను గడించగా,  ఐడీఎప్ సీ, యాక్సిస్ బ్యాంక్, హీరో మెటాకార్పోరేషన్, సన్ ఫార్మ, టాలా మోటార్స్ సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raghuram Rajan  RBI  RBI rate unchanged  Repo rate  

Other Articles