Samsung z1 smartphone has been launched

Samsung smart phones, samsung Z1 smartphone, samsung Z1 launched in India, samsung z1 india price, samsung z1 indian cost, samsung z1 cost in america, samsung z1 cost in dollors, samsung z1 cost in india, samsung z1 cost INR 5,700, samsung z1 cost $92. samsung’s first Tizen OS-based smartphone, samsung os smartphone, samsung own operating system, samsung z1 colours, z1 in White, Black, and Wine Red colours

Samsung Z1 smartphone has been launched in India with a price tag of INR 5,700 ($92). It is the company’s first Tizen OS-based smartphone in the country, and is available in White, Black, and Wine Red colour options

సొంత ఓఎస్ తో శ్యామ్ సంగ్ ‘జెడ్ వన్’ టైజన్ స్మార్ట్ ఫోన్..

Posted: 01/14/2015 05:40 PM IST
Samsung z1 smartphone has been launched

స్మార్ట్ ఫోన్ల విక్రయాలలో అగ్రగామిగా ఉన్న ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్సంగ్.. సొంత ఆపరేటింగ్ సిస్టమ్తో కూడిన తొలి స్మార్ట్ ఫోన్ను భారతీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. సామాన్యులకు కూడా అందుబాటులో వుండే విధంగా ధీని ధరను నిర్ణయించింది సంస్థ యాజమాన్యం. ఇన్నాళ్లూ గూగుల్ ఆండ్రాయిడ్ అపరేటింగ్ సిస్టమ్ పై ఆధారపడిన శామ్సంగ్.. తొలిసారి తన సొంతగా ఆపరేటింగ్ సిస్టమ్ ను తయారు చేసి దానిని టైజన్ ఆపరేటింగ్ సిస్టమ్ గా నామకరణం చేసింది. టైజన్ ఓఎస్ ఆధారంగా రూపోందిచిన జెడ్ 1 స్మార్ట్ ఫొన్లను భారతీయ విపణిలోకి విడుదల చేసింది.

శ్యామ్ సంగ్ జడ్1 ఫోన్లను తొలిసారిగా భారతదేశంలో బుధవారం నుంచే అందుబాటులోకి వచ్చాయి. వీటి ధర రూ. 5,700. తొలిసారి స్మార్ట్ ఫోన్లు కొనాలనుకునేవాళ్లు లక్ష్యంగా వీటిని మార్కెట్లోకి దించినట్లు తెలుస్తోంది. ఇందులో 4 అంగుళాల డిస్ప్లే ఉంటుంది. ప్లాస్టిక్ బాడీ కలిగి ఉంటుంది. మరే  ఇతర దేశంలోనూ ఇంకా ఈ ఫోన్లను విడుదల చేయలేదు. టైజెన్ స్టోర్లో వెయ్యికి పైగా యాప్స్ డౌన్లోడ్ చేసుకోడానికి అందుబాటులో ఉంటాయని శామ్సంగ్ ప్రతినిధులు తెలిపారు. అయితే, గూగుల్ ప్లేస్టోర్తో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువ. ఇక ఈ ఫోన్లలో ముందుగానే అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ ఇన్, యాహూ, యూట్యూబ్ లాంటివి ఇన్స్టాల్ చేసి ఉంటాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : smartphones  samsung  tizen os  samsung z1  

Other Articles