Air costa announces happy sankranthi offer

Domestic airlines Air Costa, air costa announced Happy Sankranti, air costa happy sankranti offer, happy sankranti festival trips, festival and holiday’s seasons. air costa discount on tickets, Air Costa’s reservation centre, air costa airport ticketing offices

Air Costa has announced Sankranti offer for travellers planning their trips for festival and holiday’s seasons.

ఎయిర్ కోస్తా హ్యాపీ సంక్రాంతితో విమానయానం చాలా చౌక..

Posted: 01/13/2015 05:06 PM IST
Air costa announces happy sankranthi offer

టిక్కెట్లపై రాయితీలతో టాటా విస్తారా, ఎయిర్ ఇండియా తరువాత పండగ ప్రయాణికులను ఆకర్షించే పనిలో పడింది ఎయిర్ కోస్తా విమానయాన సంస్థ. ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా కార్యకాలపాలను సాగిస్తున్న ఈ సంస్థ సంక్రాంతి పర్వదినం రోజుల్లో వుండే ప్రయాణికుల రద్దీ దృశ్యా వారిని తక్కువ ధరలకు గమ్యాలకు చేర్చేందుకు సిద్దమయ్యింది. సంక్రాంతి సందర్భంగా ఎయిర్ కోస్టా విమానయాన సంస్థ కొత్త ఆఫర్ ప్రకటించింది. 'హ్యాపీ సంక్రాంతి' పేరుతో తక్కువ ధరకే విమాన యానం అందించే ఈ ఆఫర్ను అందుబాటులోకి తెచ్చింది.

పండుగలు, సెలవులను దృష్టిలో పెట్టుకుని దేశీయ విమానయానాన్ని ఒక్క వైపుకు మాత్రమే కేవలం 1,800 రూపాయల నుంచే టికెట్లను అందిస్తున్నట్లు ఎయిర్ కోస్టా సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. జనవరి 12 మధ్యాహ్నం 3 గంటల నుంచి జనవరి 15 మధ్యాహ్నం 3 గంటలలోపు బుక్ చేసుకున్నవారికి మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుంది. ఈ ఆఫర్ సమయంలో బుక్ చేసుకున్న టికెట్లతో ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 15లోగా ఎప్పుడైనా ప్రయాణం చేయొచ్చని ప్రకటనలో పేర్కోంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Air costa  happy sankranti offer  discounted tickets  

Other Articles