Google nexus 6 and 9 to hit indian markets in november

Nexus 6, Nexus 9, Google, Apple, IPhone6, google, motorola

nexus 6 and to hit indian markets in november

నవంబర్ లో భారతీయ మార్కెట్లలోకి రానున్న గూగుల్ నెక్సెస్ ఫోన్లు

Posted: 10/16/2014 05:20 PM IST
Google nexus 6 and 9 to hit indian markets in november

ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ భారతీయ మార్కెట్లోకి కొత్త మొబైల్ ఫోన్లు నవంబర్ మొదటి వారంలో విడుదల చేయనుంది. ఈ మేరకు ఆ సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. తాజాగా గూగుల్ రూపొందించిన నెక్సస్ 6, నెక్సస్ 9 ఫోన్లను యూఎస్ తోపాటు ఇతర దేశాల్లో కూడా విడుదల చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకుంటోంది. అపిల్ సంస్థ రూపోందించిన ఐ ఫోన్ 6, 6 ప్లస్ లకు పోటీగా గూగుల్ సంస్థ నెక్సెస్ 6, నెక్సెస్ 9 ఫోన్లను రూపోందించిందని మార్కట్ వర్గాల్లో టాక్.
 
గూగుల్ తో కలిసి మోటోరోలా మొబైల్ ఫోన్ల కంపెనీ కలసి రూపొందిస్తున్న నెక్సస్ 6 ఫోన్ అక్టోబర్ చివరి వారంలో ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చని.. నవంబర్ మొదటి వారంలో స్టోర్స్ లో అందుబాటులోకి వస్తాయని కంపెనీ వెల్లడించింది. ఆపిల్ కంపెనీ నుంచి ఎదురవుతున్న తీవ్ర పోటిని తట్టుకునేందుకు కొత్త ప్రోడక్టులను మార్కెట్ తీసుకురావడానికి ఇవాళ నిర్వహించే ఓ సమావేశంలో గూగుల్, మోటరోలా కంసెనీలు ఓ నిర్ణయం వచ్చే అవకాశం కనిపిస్తోంది.
 
మొబైల్ మార్కెట్ లో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ భారత్ లో విడుదల చేసిన సేపథ్యంలో వాటికి పోటీగా తమ మొబల్ ఉత్పత్తులు వుండేలా ఈ సమావేశంలో చర్చించనున్నారు. మొబైల్ ఫోన్ వినియోగంలో భారత్ వేగంగా దూసుకుపోతుందని గణాంకాల నేపథ్యంలో భారతీయ మార్కట్ను తమ సాధ్యమైనంత వరకు క్యాప్చర్ చేయాలని గూగుల్ యత్నిస్తోంది. మరి వారి ప్రయత్నాలు ఫలిస్తాయో..? లేదో..? వేచి చూడాల్సిందే.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nexus 6  Nexus 9  Google  Apple  IPhone6  google  motorola  

Other Articles